Sunny Leone : అతగాడు బరితెగించాడు. ఏకంగా పో*ర్న్ స్టార్ సన్నీ లియోన్ పేరుతో బ్యాంకు అకౌంటును ఓపెన్ చేయించాడు. సన్నీ లియోన్ పేరుతో ‘మహతరీ వందన్ యోజన’ స్కీంకు అప్లై చేశాడు. దానికి ఎంపిక కావడంతో.. సన్నీలియోన్ పేరుతో తెరిచిన బ్యాంకు అకౌంటులోకి ప్రతినెలా రూ.1000 చొప్పున డబ్బులు కూడా జమయ్యాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతంలో ఉన్న తాలూర్ గ్రామంలో చోటుచేసుకున్న ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగుచూసింది.
Also Read :India VS Bangladesh : షేక్ హసీనాను మాకు అప్పగించండి.. భారత్‌కు బంగ్లాదేశ్ మౌఖిక సందేశం
వీరేంద్ర జోషి అనే వ్యక్తి సన్నీ లియోన్(Sunny Leone) పేరుతో బ్యాంకు ఖాతాను తెరిపించి, గవర్నమెంటు ఆర్థికసాయాన్ని తీసుకున్నాడని వెల్లడైంది. మహతరీ వందన్ యోజన స్కీం ద్వారా అక్రమంగా పొందిన నిధులను రికవరీ చేసే క్రమంలో వీరేంద్ర జోషి బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఇక అతడిపై కేసు కూడా నమోదు చేశారు. మరిన్ని వివరాలను సేకరించేందుకు ప్రస్తుతం సంబంధిత విభాగం ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read :INDIA bloc : ‘ఇండియా’ పగ్గాలను కాంగ్రెస్ వదులుకుంటే బెటర్ : మణిశంకర్ అయ్యర్
‘మహతరీ వందన్ యోజన’ స్కీంలో భాగంగా 18 ఏళ్లకుపైబడిన మహిళలకు ప్రతినెలా రూ.1000 ఆర్థికసాయాన్ని అందించే స్కీంను ఛత్తీస్‌గఢ్‌లోని బీజేపీ సర్కారు అమలుచేస్తోంది. ఇక ఈ అంశంపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య విమర్శల యుద్ధం నడుస్తోంది. మహతారీ వందన్ యోజన లబ్ధిదారులలో 50 శాతానికిపైగా నకిలీలే అని కాంగ్రెస్ పార్టీ అంటోంది. కాంగ్రెస్ హయాంలో మహిళలను పట్టించుకోలేదని.. ఇప్పుడు తాము ఆదుకుంటున్నామని బీజేపీ చెబుతోంది. రాష్ట్రంలోని మహిళలు లబ్ధి పొందడం ఓర్వలేక తమ ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు చేస్తోందని పేర్కొంది. మొత్తం మీద ఈ అంశం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.