Site icon HashtagU Telugu

Sukesh Chandrasekhar: పాల‌క్ ప‌నీర్‌, స‌లాడ్‌ల‌ను కేజ్రీవాల్ ఆస్వాదిస్తున్నాడు.. మ‌రో లేఖ విడుద‌ల చేసిన సుఖేష్

Sukesh Chandrasekhar

Safeimagekit Resized Img (1) 11zon

Sukesh Chandrasekhar: మనీ లాండరింగ్ కేసులో అరెస్టై ప్రస్తుతం మండోలి జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ (Sukesh Chandrasekhar) మ‌రో సంచ‌ల‌న లేఖ‌ను విడుద‌ల చేశారు. ఈ లేఖ‌లో ప‌లు అంశాలు పేర్కొన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్, సత్యేంద్ర జైన్, కైలాష్ గెహ్లాట్లను ఉద్దేశించి సుఖేష్ చంద్రశేఖర్ లేఖ‌ను విడుద‌ల చేశారు. అరవింద్ కేజ్రివాల్, సత్యేంద్ర జైన్.. జైళ్ల శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ సహకారంతో తీహార్ జైల్లో సంతృప్తిగా ఉన్నారని నేను భావిస్తున్నానని సుఖేష్ త‌న లేఖ‌లో పేర్కొన్నాడు. అంతేకాకుండా జైళ్ల శాఖ అధికారులతో త‌న‌పై ఒత్తిడి, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించాడు.

వ్యతిరేకంగా ఇస్తున్న స్టేట్‌మెంట్‌లు, ప్రకటనలు తక్షణమే మానేయాలని బెదిరిస్తున్నారని లేఖ‌లో పేర్కొన్నాడు. నేను ఎవరికీ భయపడను, దేనిని ఆపనని స్ప‌ష్టం చేశాడు. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ప్రతి విషయాన్ని బయట పెడతానని లేఖ‌లో వివ‌రించాడు. మీరు నాపై ఎంత ఒత్తిడి తెచ్చిన నేను అదేపనిని కొనసాగిస్తానని రాసుకొచ్చాడు. కైలాస్ గెహ్లాట్.. సూపరింటెండెంట్, ఇతర జైళ్ల అధికారుల ద్వారా ఎలాంటి ఒత్తిడి తెచ్చిన మీ విషయాలను మరింత బహిర్గతం చేస్తానని తెలిపాడు. కేజ్రీవాల్ జీ మీరు నా రాజ్యసభ సీటు కోసం 50 కోట్లు తీసుకున్నారని లేఖ‌లో తెలిపాడు. కేజ్రీవాల్ సూచన మేరకు నేను మీ ఫామ్ హౌస్ లో డెలివరీ చేసిన డబ్బు దానికి సంబంధించిన అన్ని వాట్సాప్‌ చాట్ లు కూడా నా దగ్గర ఉన్నాయ‌న్నాడు.

Also Read: Green Chiretta Benefits : నేలవేము ఉపయోగాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టారు

గత మూడు, నాలుగు రోజుల నుండి జైలు అధికారుల ద్వారా పంపిన తాజా బెదిరింపులు, తెస్తున్న‌ ఒత్తిడి.. హోం శాఖ, సీబీఐతో దర్యాప్తు చేయబడుతుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మీరు(కేజ్రీవాల్). నేను, సత్యేంద్ర జైన్ జైలు అధికారులు మధ్య జరిగిన వాట్సాప్ చాట్ల ట్రైలర్ ను విడుదల చేస్తానని తెలిపాడు. చివరగా కేజ్రీవాల్ కు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. తీహార్ క్లబ్ లో మరో మూడు స్లాట్లను సిద్ధంగా ఉంచండి. మీకు సంబంధించిన మరో ముగ్గురు స్నేహితులు తీహార్ జైలుకు రాబోతున్నారు.. ప్లాటినం సభ్యత్వం సిద్ధంగా ఉంచండి అని పేర్కొన్నాడు.

We’re now on WhatsApp : Click to Join

విచారణ సమయంలో సాక్ష్యాలను, ప్రశ్నలను ఎదుర్కొనే సమయంలో త్వరలోనే మనం కలుద్దాం. కేజ్రీవాల్ జీ మీరు బరువు తగ్గుతున్నారని, అనారోగ్యం పాలవుతున్నారని ప్రజలను మోసం చేయడం మానేయండి. అరవింద్ కేజ్రీవాల్ సలాడ్లు, పాలక్ పనీర్లను విలాసవంతంగా ఆస్వాదిస్తున్నాడని అందరూ తెలుసుకోవాలని సుఖేష్ చంద్రశేఖర్ త‌న లేఖ‌లో పేర్కొన్నాడు.