Bhopal : భోపాల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నివాసంలో మృత‌దేహం క‌ల‌క‌లం

భోపాల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓంకార్ సింగ్ నివాసంలో మృతదేమం క‌ల‌క‌లం రేపింది. ఎమ్మెల్యే ఓంకార్ సింగ్ మార్కం బంగ్లాలో తిరత్ సింగ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సంఘటన స్థలంలో సూసైడ్ నోట్ ల‌భించిందిని.. అందులో మృతుడు క్యాన్స‌ర్ వ్యాధితో బాధపడుతున్నాడ‌ని..అందుకే చనిపోవాల‌ని నిర్ణ‌యం తీస‌కున్న‌ట్లు నోట్ లో పేర్కొన్నాడని పోలీసులు తెలిపారు. తీరత్ సింగ్ దిండోరి జిల్లా వాసిగా పోలీసులు గుర్తించారు. మృతుడు భోపాల్‌లో చదువుతున్నాడు. ఓంకార్ సింగ్ మార్కం […]

Published By: HashtagU Telugu Desk
Student's suicide at Tirumala school... Here is the actual truth...

Student's suicide at Tirumala school... Here is the actual truth...

భోపాల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓంకార్ సింగ్ నివాసంలో మృతదేమం క‌ల‌క‌లం రేపింది. ఎమ్మెల్యే ఓంకార్ సింగ్ మార్కం బంగ్లాలో తిరత్ సింగ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సంఘటన స్థలంలో సూసైడ్ నోట్ ల‌భించిందిని.. అందులో మృతుడు క్యాన్స‌ర్ వ్యాధితో బాధపడుతున్నాడ‌ని..అందుకే చనిపోవాల‌ని నిర్ణ‌యం తీస‌కున్న‌ట్లు నోట్ లో పేర్కొన్నాడని పోలీసులు తెలిపారు. తీరత్ సింగ్ దిండోరి జిల్లా వాసిగా పోలీసులు గుర్తించారు. మృతుడు భోపాల్‌లో చదువుతున్నాడు. ఓంకార్ సింగ్ మార్కం కూడా దిండోరికి చెందిన వ్యక్తి కావడంతో మృతుడి బంధువుల‌కు ఉన్న ప‌రిచ‌యాల‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యే నివాసంలో ఉంటున్నాడు. శనివారం రాత్రి భోపాల్‌లోని ఓంకార్‌సింగ్‌ మార్కం బంగ్లాలో తీరత్‌సింగ్‌ ఉరివేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు బంగ్లాకు చేరుకుని విద్యార్థిని పైనుంచి నుంచి కిందకు దింపగా.. అప్పటికే అతడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో ఎమ్మెల్యే ఓంకార్ సింగ్ మార్కం బంగ్లాలో లేరు. అయితే విష‌యం తెలుసుకున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఓంకార్ సింగ్ మృతుడి కుటుంబసభ్యులతో కలిసి మార్చురీకి చేరుకున్నారు. మృతుడికి గొంతు క్యాన్సర్ ఉందని, నాలుగేళ్లుగా చికిత్స పొందుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. చికిత్స సమయంలో వ్యాధిలో స్వల్ప మెరుగుదల కనిపించింది, కానీ కొంత కాలం పాటు నొప్పి పెరగడంతో.. తీరత్ బాధపడుతున్న‌ట్లు కుటుంబ‌స‌భ్యులు తెలిపారు.

  Last Updated: 26 Dec 2022, 07:24 AM IST