Site icon HashtagU Telugu

Maha Kumbh Stampede : డస్ట్ బిన్స్ వల్లే తొక్కిసలాట.. మహాకుంభ మేళాలోని ప్రత్యక్ష సాక్షులు

Mahakumbh Mela Stampede

Mahakumbh Mela Stampede

Maha Kumbh Stampede : మహాకుంభ మేళా వేళ ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌‌ త్రివేణీ సంగమంలో ఇవాళ తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో పదుల సంఖ్యలో భక్తులు చనిపోయారు. పదులసంఖ్యలో భక్తులకు గాయాలయ్యాయి. ప్రస్తుతం వారికి చికిత్స జరుగుతోంది. త్రివేణి సంగమానికి కిలోమీటరు దూరంలో జరిగిన ఈ తొక్కిసలాట జరిగింది. ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారో చూద్దాం..

Also Read :Trump Buyouts Offer : 8 నెలల శాలరీ ఇస్తా.. జాబ్ వదిలేయండి.. ప్రభుత్వ ఉద్యోగులకు ట్రంప్ ఆఫర్

ప్రత్యక్ష సాక్షుల కథనమిది.. 

‘‘ఇవాళ తెల్లవారుజామున దాదాపు 2 గంటల సమయంలో పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు భారీగా త్రివేణి సంగమానికి(Maha Kumbh Stampede) వచ్చారు. అయితే పుణ్యస్నానాలు చేయడానికి ఎటువైపు వెళ్లాలనేది చాలామందికి తెలియదు. అయితే త్రివేణీ సంగమం పరిసరాల్లో ఉన్న ఇనుప చెత్త డబ్బాలు వారికి కనిపించలేదు. దీంతో అవి తగిలి చాలామంది కింద పడ్డారు. ఆ తర్వాతే తొక్కిసలాట మొదలైంది. తొక్కిసలాట జరిగిన చోట జనం నిండిపోయారు. దీంతో ఎటు వెళ్లాలో ఎవరికీ అర్థం కాలేదు. ఈక్రమంలో కొందరు స్పృహ తప్పి కిందపడ్డారు’’ అని పలువురు ప్రత్యక్ష సాక్షులు మీడియాకు తెలిపారు.

Also Read :Telangana Land Prices : తెలంగాణలో పెరగనున్న భూముల విలువలు.. ఎంత ?

సీఎం వాదన ఇదీ.. 

త్రివేణీ సంగమంలోని అఖారా మార్గ్‌లో ఉన్న బ్యారికేడ్లను పెద్దసంఖ్యలో భక్తులు దాటేందుకు యత్నించగా తొక్కిసలాట జరిగిందని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు.  భక్తులంతా సంగమంలోని ప్రధాన ఘాట్ వద్దే పుణ్యస్నానానికి పోటీ పడొద్దని ఆయన కోరారు. సమీపంలో ఏ ఘాట్ ఉంటే అక్కడే పుణ్యస్నానాలు చేయాలని భక్తులకు సీఎం సూచించారు.  ప్రధాని మోదీ తనకు  నాలుగు సార్లు ఫోన్ చేసి ఈ ఘటనపై ఆరాతీశారన్నారు.

ప్రధాని మోడీ, రాష్ట్రపతి ముర్ము దిగ్భ్రాంతి

త్రివేణీ సంగమంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన భక్తుల కుటుంబాలకు ప్రధాని మోడీ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. బాధితులను ఆదుకుంటామన్నారు. ఈ ఘటనపై తాను సీఎం యోగితో మాట్లాడినట్లు చెప్పారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు ఆమె ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

Also Read :Nandigam Suresh : 145 రోజుల తర్వాత నందిగం సురేష్ బెయిల్‌

శ్రీశ్రీ రవిశంకర్ ఏమన్నారంటే..

భక్తులు తొందరపాటు వైఖరితో వ్యవహరించడం వల్లే తోపులాటలు, తొక్కిసలాటలు జరుగుతుంటాయని ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ అభిప్రాయపడ్డారు. మహాకుంభ మేళాకు హాజరయ్యే భక్తులకు తప్పకుండా ఓపిక ఉండాలన్నారు.