Shocking Incident : అది షాకింగ్ ఘటన. చనిపోయిన తండ్రి డెడ్‌బాడీని ఆ అన్నదమ్ములు నడిరోడ్డుపై పెట్టారు. భౌతిక కాయానికి అంత్యక్రియలు చేసే విషయంలో దారుణంగా గొడవపడ్డారు. ఈక్రమంలో చనిపోయిన వ్యక్తి పెద్ద కొడుకు ఘోరమైన కామెంట్స్ చేశాడు. తండ్రి డెడ్‌బాడీని రెండు ముక్కలు చేసి, పంచి ఇస్తే.. వేర్వేరుగా అంత్యక్రియలు చేసుకుంటామన్నాడు. ఈ షాకింగ్ ఘటనపై మరిన్ని వివరాలివీ..
Also Read :Cyberabad Traffic Pulse : హైదరాబాద్ వాహనదారుల ట్రాఫిక్ కష్టాలను తీర్చే కొత్త మార్గం
రచ్చ చేశాడు
పైన మనం చెప్పుకున్న దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగిన ఒక రోజు తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. తీకంఘర్ జిల్లాలోని లిధౌరా తాల్ గ్రామంలో ధ్యాని సింగ్ ఘోష్(Shocking Incident) నివసించేవాడు. అతడి వయసు 85 సంవత్సరాలు. ధ్యాని సింగ్‌కు ఇద్దరు కొడుకులు. చిన్న కొడుకు దామోదర్ దగ్గరే ధ్యాని సింగ్ ఉండేవాడు. ఈనేపథ్యంలో ధ్యాని సింగ్ చనిపోగానే చిన్న కొడుకు దామోదర్ అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేశాడు. చివర్లో ఎంట్రీ ఇచ్చిన పెద్ద కొడుకు కిషన్ సింగ్ రచ్చ చేశాడు. తాను అంత్యక్రియలు నిర్వహిస్తానంటూ గొడవకు దిగాడు. ఎవరు చెప్పినా తగ్గేదేలా అన్నాడు.
Also Read :AP BJP : టార్గెట్ ఆ ఏడుగురు.. ఏపీలో బీజేపీ బిగ్ స్కెచ్
ఈ మాటలు విని..
ఈక్రమంలో స్పందించిన కిషన్ తమ్ముడు దామోదర్.. ‘‘నాన్న జీవించినన్ని నాళ్లు నా దగ్గరే ఉన్నాడు. కడదాకా ఆయనకు సపర్యలు చేసింది నేనే. అందుకే ఆయనకు అంత్యక్రియలు నేనే చేయాలి’’ అని చెప్పాడు. అయినా ఈ మాటలను కిషన్ సింగ్ చెవికి ఎక్కించుకోలేదు. గ్రామస్తులు, బంధువులు ఎంత చెప్పినా అతగాడు నో అన్నాడు. చివరకు చాలా అమానుష మాటలు మాట్లాడాడు. తండ్రి డెడ్‌బాడీని రెండు ముక్కలు చేసి ఇస్తే, వేర్వేరుగా అంత్యక్రియలు చేసుకుంటామని కిషన్ పేర్కొన్నాడు. ఈ మాటలు విని గ్రామస్తులు తీవ్ర విస్మయానికి లోనయ్యారు. దీనిపై పలువురు వెంటనే జతారా ఏరియా పోలీసులకు సమాచారాన్ని అందించారు. దీంతో పోలీసులు వచ్చి అసలు విషయమేంటో తెలుసుకున్నారు. ఇద్దరు అన్నదమ్ములను కూర్చోబెట్టి మాట్లాడారు. అంత్యక్రియలు కలిసి నిర్వహించాలన్నారు. డెడ్‌బాడీ విషయంలో తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదని కిషన్‌కు వార్నింగ్ ఇచ్చారు. దీంతో కిషన్ కూల్ అయిపోయాడు. తన సోదరుడు దామోదర్‌తో కలిసి తండ్రి అంత్యక్రియలు నిర్వహించాడు. ఈక్రమంలో అంత్యక్రియల కార్యక్రమం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.