Site icon HashtagU Telugu

SBI Jobs : 1040 జాబ్స్ భర్తీకి ఎస్​బీఐ భారీ నోటిఫికేషన్

SBI Huge Notification

SBI Jobs :  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)  1040 స్పెషలిస్ట్ కేడర్​ ఆఫీసర్​ (SCO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో అత్యధికంగా 643 వీపీ వెల్త్​  పోస్టులు, 273 రిలేషన్​షిప్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి.  49 ఇన్వెస్ట్​మెంట్ ఆఫీసర్ పోస్టులు, 32  రిలేషన్​షిప్ మేనేజర్​ (టీమ్​ లీడ్​) పోస్టులు,  30 ఇన్వెస్ట్​మెంట్ స్పెషలిస్ట్ పోస్టులు ఉన్నాయి. ఇక 6 రీజినల్​ హెడ్ పోస్టులు, 2 సెంట్రల్​ రీసెర్చ్ టీమ్​ (ప్రోడక్ట్ లీడ్​) పోస్టులు,  2 సెంట్రల్​ రీసెర్చ్​ టీమ్​ (సపోర్ట్​) పోస్టులు, 2 ప్రాజెక్ట్ డెవలప్​మెంట్​ మేనేజర్ (బిజినెస్​) పోస్టులు ఉన్నాయి. 1 ప్రాజెక్ట్ డెవలప్​మెంట్​ మేనేజర్ (టెక్నాలజీ)  పోస్టు(SBI Jobs)  ఉంది.

Also Read :CM Revanth Reddy: సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన అభ్యర్థులకు సీఎం రేవంత్ లక్ష సాయం

అభ్యర్థుల అర్హతలు, అనుభవం ఆధారంగా ప్రాథమికంగా ఎంపిక చేస్తారు. అనంతరం వారికి ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్స్ నిర్వహిస్తారు. తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్​, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి, అర్హులను జాబ్స్ ఇస్తారు. అర్హతలు కలిగిన అభ్యర్థులు https://sbi.co.in/web/careers వెబ్​సైట్ ద్వారా అప్లై చేయొచ్చు. జనరల్​, ఈడబ్ల్యూఎస్​ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.750 చెల్లించాలి. ఓబీసీ, దివ్యాంగులు, ఎస్​టీ, ఎస్సీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు ఉండదు. అప్లికేషన్ల ప్రక్రియ జులై 19న ప్రారంభమైంది. ఆగస్టు 8 వరకు అప్లై చేయొచ్చు.

We’re now on WhatsApp. Click to Join

Also Read :Nara Lokesh: సౌదీ అరేబియాలో చిక్కుకున్న వీరేంద్ర, రంగంలోకి మంత్రి లోకేష్