AAP: ‘సత్యేంద్ర కా దర్బార్’ ఆప్ మంత్రికి సంబంధించిన మరో వీడియో వైరల్..!!

  • Written By:
  • Publish Date - November 26, 2022 / 12:20 PM IST

మనీలాండరింగ్ కేసులో అరెస్టయి ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ కేబినెట్ మంత్రి సత్యేందర్ జైన్ కు సంబంధించిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోను షేర్ చేస్తూ బీజేపీ దీనిని సత్యేంద్ర కోర్టుగా అభివర్ణించింది. రాత్రి ఎనిమిది గంటల తర్వాత జైలు సూపరింటెండెంట్ సత్యేందర్ జైన్ ను కలిసినట్లు ఈ వీడియో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సీసీటీవీ ఫుటేజీ సెప్టెంబర్ 12వ తారీఖు నాటిది. సస్పెండ్ అయిన జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్ సెల్ లోఉన్న సత్యేందర్ మాట్లాడుతున్నట్లు ఈ వీడియోలో మనం చూడవచ్చు. సత్యేందర్ జైన్ కు వీఐపీ వసతులు కలిపించారన్న ఆరోపణలతో అజిత్ కుమార్ ను ఈ నెల ప్రారంబంలోనే సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

బీజేపీ అధికార ప్రతినిధి షాజద్ పూనావాలా వీడియోను ట్వీట్ చేశారు. తీహార్ జైలులో అధికార నేతలను ఎలా చూస్తారన్నేది ఈ వీడియోను చూస్తే స్పష్టం గా అర్థం అవుతోంది. ఈ సారి సత్యేందర్ కా దర్బార్ జైలు సూపరింటెండెంట్ ని సస్పెండ్ చేశారు. అంటూ ట్వీట్ చేశారు. ఢిల్లీ మంత్రికి జైలులో ప్రత్యేక ట్రీట్ మెంట్ ఇస్తున్నట్లు బయటపడుతున్న వీడియోలు ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి.