Sachin Pilot Divorced : సారా అబ్దుల్లాకు విడాకులిచ్చిన సచిన్ పైలట్.. వాళ్ల లవ్ స్టోరీ అలా మొదలైంది!

Sachin Pilot Divorced : రాజస్థాన్ కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్  విడాకులు తీసుకున్నారు.

Published By: HashtagU Telugu Desk
Sachin Pilot Divorced

Sachin Pilot Divorced

Sachin Pilot Divorced : రాజస్థాన్ కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్  విడాకులు తీసుకున్నారు. ఆయన తన భార్య సారా అబ్దుల్లాకు విడాకులు ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా కుమార్తెనే సారా అబ్దుల్లా. అక్టోబర్ 31న సమర్పించిన ఎన్నికల నామినేషన్‌ పత్రంలో విడాకుల అంశాన్ని సచిన్ పైలట్  ప్రస్తావించారు. ఎన్నికల అఫిడవిట్‌లోని లైఫ్ పార్ట్‌నర్ వివరాల స్థానంలో ‘డైవర్స్‌డ్’ అని ప్రస్తావించారు. తన కుమారులు ఆరన్, వెహాన్ ఇద్దరూ తనపైనే ఆధారపడి ఉన్నారని ఎన్నికల అఫిడవిట్‌లో సచిన్ పైలట్ పేర్కొనడం గమనార్హం. అయితే  సచిన్ పైలట్, సారా అబ్దుల్లా ఎప్పుడు విడిపోయారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. తన భార్య నుంచి విడిపోయిన విషయాన్ని ఇప్పటివరకు సచిన్ పైలట్ బహిరంగంగా వెల్లడించలేదు.

We’re now on WhatsApp. Click to Join.

సారా అబ్దుల్లా, సచిన్ పైలట్ ప్రేమకథ.. 

1990వ దశకంలో కాశ్మీర్‌లో ఏర్పడిన  ఉద్రిక్తతల కారణంగా సారా అబ్దుల్లాను, ఆమె తల్లిని ఫరూక్ అబ్దుల్లా లండన్‌కు పంపించారు. ఆ సమయంలో సచిన్ పైలట్ లండన్‌లోనే ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. అక్కడే సచిన్ పైలట్, సారా అబ్దుల్లా మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత భారత్‌కు వచ్చి వాళ్లిద్దరు పెళ్లి చేసుకుంటామని చెప్పగా.. రెండు కుటుంబాలు అంగీకరించలేదు. గుజ్జర్‌ల కుటుంబం నుంచి వచ్చిన సచిన్ పైలట్, ముస్లిం కుటుంబం నుంచి వచ్చిన సారా అబ్దుల్లా పెళ్లి కోసం నెలల తరబడి వేచి చూశారు. ఎలాంటి అంగీకారం లభించకపోవడంతో 2004 జనవరిలో అతి తక్కువ మంది అతిథుల మధ్య సచిన్ పైలట్, సారా అబ్దుల్లా పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహాన్ని మొదట బహిష్కరించిన అబ్దుల్లా కుటుంబం.. తర్వాత కుమార్తెకు దగ్గరయ్యారు. పెళ్లి తర్వాత కొన్ని రోజులకే సచిన్ పైలట్ రాజకీయాల్లోకి(Sachin Pilot Divorced) అడుగు పెట్టారు.

Also Read: Chandrababu : ఇవాళ హైదరాబాద్‌‌కు చంద్రబాబు.. అచ్చెన్నాయుడు ఏమన్నారంటే ?

  Last Updated: 01 Nov 2023, 07:25 AM IST