Site icon HashtagU Telugu

BR Ambedkar : ఆర్ఎస్ఎస్‌ శాఖలో అంబేద్కర్ ప్రసంగించారు.. ఆర్ఎస్ఎస్ సంచలన ప్రకటన

Br Ambedkar Rss Shakha Maharashtra Satara Rss Media Wing

BR Ambedkar : భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌కు సంబంధించి బీజేపీ మాతృసంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్‌సంఘ్ (ఆర్ఎస్ఎస్) కీలక ప్రకటన చేసింది. 1940 సంవత్సరం జనవరి 2న మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని కరద్‌లో ఉన్న ఆర్ఎస్ఎస్ శాఖను అంబేద్కర్ సందర్శించారని విదర్భ ప్రాంత ఆర్ఎస్ఎస్ కమ్యూనికేషన్ విభాగం ‘విశ్వ సంవాద్ కేంద్ర’ (వీఎస్‌కే) గురువారం వెల్లడించింది. ఆ శాఖలోని ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్‌లను ఉద్దేశించి అంబేద్కర్ ప్రసంగించారని తెలిపింది.

Also Read :Chamala Kiran Kumar : అల్లు అర్జున్ అరెస్ట్‌తో సీఎం రేవంత్‌రెడ్డి పాన్ ఇండియా నాయకుడు అయ్యారు

‘‘ఆర్ఎస్ఎస్‌పై కొందరు అనవసర బురద జల్లేందుకు యత్నించారు. ఆర్ఎస్ఎస్ దళితులకు వ్యతిరేకమైందని తప్పుడు ప్రచారం చేశారు. అయితే ఆర్ఎస్ఎస్‌తో అంబేద్కర్‌కు ఉన్న సంబంధాన్ని నిరూపించే ఆధారాలు ఇప్పుడు బయటికొచ్చాయి’’ అని  ఆర్ఎస్ఎస్ కమ్యూనికేషన్ విభాగం(BR Ambedkar) వెల్లడించింది. కరద్‌లో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులను ఉద్దేశించి అంబేద్కర్ ప్రసంగిస్తూ.. ‘‘కొన్ని అంశాల విషయంలో వైరుధ్యాలు, విబేధాలు ఉన్నప్పటికీ.. ఏదో అనుబంధమున్న కోణంలోనే నేను ఆర్ఎస్ఎస్‌ను చూస్తాను’’ అని చెప్పారని ఆర్ఎస్ఎస్ తెలిపింది. ఈవివరాలు 1940 సంవత్సరం జనవరి 9న పూణేలోని కేసరి అనే మరాఠీ పత్రికలో ప్రచురితం అయ్యాయని పేర్కొంది.

Also Read :Viral News : దున్నపోతు కోసం కొట్టుకున్న రెండు గ్రామాలు.. చివరికి ఏమైందంటే..!

ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్తల్లో ఒకరైన దత్తోపంత్ థెంగాడీ రాసిన ‘డాక్టర్ అంబేద్కర్ ఔర్ సామాజిక్ క్రాంతీ కీ యాత్ర’ అనే పుస్తకంలో కూడా ఆర్ఎస్ఎస్ శాఖలో అంబేద్కర్ చేసిన ప్రసంగం వివరాల ప్రస్తావన ఉందని ఆర్ఎస్ఎస్ వివరించింది.  ఆర్ఎస్ఎస్, అంబేద్కర్ అనుబంధం వివరాలు ఆ పుస్తకంలో ఉన్నాయని చెప్పింది. ‘‘ఆర్ఎస్ఎస్ గురించి అంబేద్కర్‌కు పూర్తి స్థాయిలో తెలుసు. దేశంలోని హిందువులను ఏకం చేసే సంస్థగా ఆర్ఎస్ఎస్‌ను అంబేద్కర్ గుర్తించారు. ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు రెగ్యులర్‌గా అంబేద్కర్‌తో టచ్‌లో ఉండేవారు. ఆయనతో సంప్రదింపులు జరిపేవారు’’ అని కూడా  దత్తోపంత్ థెంగాడీ పుస్తకంలో ఉందని ఆర్ఎస్ఎస్ తెలిపింది.  ‘‘1934లో మహారాష్ట్రలోని వార్ధాలో ఉన్న ఆర్ఎస్ఎస్ శాఖను జాతిపిత మహాత్మాగాంధీ సందర్శించారు’’ అని ఆర్ఎస్ఎస్ మీడియా విభాగం గుర్తు చేసింది. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ హెడ్గే‌వార్ కూడా భారత స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నారని వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీలో ఉండగా జంగిల్ సత్యాగ్రహ కార్యక్రమాల్లో  డాక్టర్ హెడ్గే‌వార్ పాల్గొన్నారని చెప్పింది.