Site icon HashtagU Telugu

4600 RPF Jobs : 4660 రైల్వే పోలీస్ జాబ్స్.. టెన్త్ అర్హతతోనే అవకాశం

4600 Rpf Jobs

4600 Rpf Jobs

4600 RPF Jobs : రైల్వే ప్రొటెక్షన్​ ఫోర్స్​ (ఆర్​పీఎఫ్​)లో 4660 పోస్టుల భర్తీకి  రైల్వే రిక్రూట్​మెంట్ బోర్డ్ (ఆర్​ఆర్​బీ) ప్రకటన విడుదల చేసింది. వీటిలో ఆర్​పీఎఫ్​ కానిస్టేబుల్ పోస్టులు ​ 4208(4600 RPF Jobs), ఆర్​పీఎఫ్ ఎస్​ఐ పోస్టులు  452 ఉన్నాయి. సబ్​-ఇన్​స్పెక్టర్ (ఎస్ఐ) పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు కనీసం బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వీరి వయసు 20 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు కనీసం 10వ తరగతి చదివి ఉండాలి. వీరి వయసు 18  నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సై జాబ్‌కు ఎంపికైతే నెలకు రూ.35,400 జీతం ఇస్తారు. కానిస్టేబుల్ జాబ్‌కు ఎంపికైతే నెలకు రూ.21,700 శాలరీ ఇస్తారు. జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.500 చెల్లించాలి. మహిళలు,  ఎక్స్ సర్వీస్​మెన్​, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల దరఖాస్తు రుసుము రూ.250. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీలకు 3 ఏళ్లు; దివ్యాంగులకు 10 ఏళ్లు; ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్ల పాటు వయోపరిమితిలో మినహాయింపును కల్పిస్తారు. దరఖాస్తుల స్వీకరణ ఇవాళే (ఏప్రిల్ 15నే) మొదలైంది. మే 14 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు.

We’re now on WhatsApp. Click to Join

ఎంపిక ప్రక్రియ ఇదీ.. 

Also Read : Delhi Liquor Policy Scam: కవితకు షాక్.. ఏప్రిల్ 23 వరకు జైలులోనే

అర్హులైన అభ్యర్థులు https://rpf.indianrailways.gov.in/RPF/  వెబ్​సైట్​లో పేరు, ఫోన్​ నంబర్​, ఈ-మెయిల్​ వివరాలను నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి. దీంతో ఒక రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్​వర్డ్ క్రియేట్ అవుతాయి. వీటితో వెబ్​సైట్​లోకి లాగిన్ కావాలి. అప్లికేషన్ ఫామ్​లో వ్యక్తిగత, విద్యార్హతల వివరాలను నమోదు చేయాలి.  ఫొటో, సిగ్నేచర్​ సహా అవసరమైన సర్టిఫికెట్స్​ అన్నీ అప్‌లోడ్ చేయాలి.

Also Read :Sai Pallavi : సీతగా నటించేందుకు సాయి పల్లవి.. అన్ని కోట్లు తీసుకుంటుందా..!