బీఎస్ఎఫ్ ప‌రిధిపై కేంద్రం, పంజాబ్ డిష్యూం డిష్యూం!

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు స‌మ‌న్వ‌యంతో ప‌రిపాల‌న సాగించాల‌ని ఫెడ‌ర‌ల్ వ్య‌వ‌స్థ చెబుతోంది. ఆ మేర‌కు భార‌త రాజ్యాంగం స్ప‌ష్టం నిబంధ‌న‌ల‌ను పెట్టింది.

  • Written By:
  • Publish Date - November 13, 2021 / 03:40 PM IST

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు స‌మ‌న్వ‌యంతో ప‌రిపాల‌న సాగించాల‌ని ఫెడ‌ర‌ల్ వ్య‌వ‌స్థ చెబుతోంది. ఆ మేర‌కు భార‌త రాజ్యాంగం స్ప‌ష్టం నిబంధ‌న‌ల‌ను పెట్టింది. కానీ, కేంద్ర ప్ర‌భుత్వం పెత్త‌నం రాష్ట్రాల మీద పెరిగిందని బీజేపీయేత‌ర ప్ర‌భుత్వాల నేత‌లు త‌ర‌చూ బాధ‌ను వెళ్ల‌గ‌కున్న‌తున్నారు. ఆ విష‌యంలో ఒక‌డుగు ముందుకేసిన పంజాబ్ ప్ర‌భుత్వం అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దు వెంబ‌డి బీఎస్ ఎఫ్ ప‌రిధిని పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌ట్టింది. అంతేకాదు, కేంద్ర జారీ చేసిన ఉత్తర్వుల‌కు వ్య‌తిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయ‌డం దేశ వ్యాప్త పొలిటిక‌ల్ హాట్ టాపిక్ గా మారింది.

Also Read :  ఏనుగు పిల్లకు పునీత్ పేరు.. అప్పుకు అరుదైన నివాళి ఇదే!

పంజాబ్, ప‌శ్చిమ‌బెంగాల్, అస్సాం రాష్ట్రాల ప‌రిధిలోని బీఎస్ ఎఫ్ బోర్డ‌ర్ ప‌రిధిని 15 కిలోమీట‌ర్ల నుంచి 50 కిలోమీట‌ర్లకు పెంచుతూ కేంద్ర ప్ర‌భుత్వం చ‌ట్టాన్ని స‌వ‌రించింది. ఆ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది. అంత‌ర్జాతీయ స‌రిహద్దు నుంచి 15 కిలోమీట‌ర్ల వ‌ర‌కు బీఎస్ ఎఫ్ ఆధీనంలో ఉండేలా గ‌తంలో చ‌ట్టం ఉండేది. ఆ మేర‌కు అక్క‌డి ప్రాంతం బీఎస్ ఎఫ్ నిఘా కింద ఉంటుంది. త‌నిఖీలు, అరెస్ట్ లు, సీజ్ చేయ‌డం, కేసులు న‌మోదు చేయ‌డం త‌దిత‌ర బీఎస్ ఎఫ్ కు నిర్వ‌హిస్తోంది. తాజాగా కేంద్రం జారీ చేసిన ఉత్వ‌ర్వుల మేర‌కు 50 కిలోమీట‌ర్లు లోప‌లి వ‌ర‌కు బీఎస్ ఎఫ్ ప‌రిధి పెరిగింది. ఆయా రాష్ట్రాల పోలీసుల‌ను కించ ప‌రిచేలా ఈ ఉత్త‌ర్వులు ఉన్నాయ‌ని అధికార పార్టీల భావ‌న‌.
పంజాబ్ ప్ర‌స్తుతం కాంగ్రెస్ పాలిత రాష్ట్రం. స‌మీప భ‌విష్య‌త్ లోనే అక్క‌డ‌ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. అందుకే, ఏ చిన్న అంశం దొరికినా రాజ‌కీయంగా దుమారం రేగుతోంది. వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ ఆ రాష్ట్రం రైతాంగం సుదీర్ఘ ఉద్య‌మం చేస్తోంది. ఆ ఉద్య‌మాన్ని అణిచే క్ర‌మంలో కేంద్రం తీసుకున్న చ‌ర్య‌ల‌ను ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం తిప్పికొట్టింది. ఇప్పుడు బీఎస్ ఎఫ్ ప‌రిధిని పెంచ‌డాన్ని రాజ‌కీయ కోణం నుంచి ఆ రాష్ట్రంలోని ప‌లు పార్టీలు చూస్తున్నాయి. పంజాబ్ సార్వ‌భౌమాధికారాన్ని ప్ర‌శ్నించేలా కేంద్రం వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆయా పార్టీలు విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. ఆ ఉత్త‌ర్వుల‌ను నిరాక‌రిస్తూ పంజాబ్ అసెంబ్లీ తీర్మానం చేసింది.

Also Read : అసలు వరిధాన్యం గొడవ ఏంటంటే….

అంతేకాదు, పంజాబ్ పోలీసులు 15 కిలో మీట‌ర్ల ప‌రిధి వ‌ర‌కే బీఎస్ ఎఫ్ కు స‌హ‌కారం అందిస్తార‌ని తీర్మానంలో పొందుప‌రిచారు. కేంద్రం పెంచుకున్న 35 కిలో మీట‌ర్ల ప‌రిధి పోలీసులు ఆధీనంలోనే ఉంటుంద‌ని తేల్చేసింది. బీఎస్ ఎఫ్ ద‌ళాల‌కు పంజాబ్ పోలీసులు స‌హ‌కారం అందించ‌ర‌ని తేల్చేసింది. ప‌‌శ్చిమ బెంగాల్‌, అస్సాం రాష్ట్రాల అసెంబ్లీలు కూడా పంజాబ్ మాదిరిగా చేస్తే ఈ అంశం మ‌రింత వివాదం అయ్యే అవ‌కాశం లేక‌పోలేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేంద్రం ఇచ్చిన ఈ ఉత్త‌ర్వులను సెంటిమెంట్ రూపంలో ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్ల‌డానికి పంజాబ్ కాంగ్రెస్ సిద్ధం అయింది. అదే బాట‌న మిగిలిన పార్టీలు కూడా వెళ్ల‌డం గ‌మ‌నార్హం.