Prashanth Kishore political party: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సోంత రాజకీయ పార్టీని ప్రారంభిచనున్నారు. ఈ మేరకు ఆయన తన సోంత రాష్ట్రం బీహర్(Bihar)లో అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా పార్టీని ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్‌లోని 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పీకే కొత్త పార్టీ పోటీ చేయనున్నట్లు సమాచారం. క్రియాశీల రాజకీయాల్లోకి రావడం ఇదే తొలిసారి. పీకే ఇంతకుముందు బీహార్‌లో జన్ సూరజ్ యాత్రకు వెళ్ళారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
బీహర్ వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలకు(Assembly election) సిద్దమవుతున్నందున్న అక్కడ క్రియశీలంగా వ్యవహరించే ఈ కోత్త రాజకీయ సంస్థ ద్వారా జనసూరజ్ యాత్ర ఊపును ఉపయోగించుకోవాలని ప్రశాంత్ కిషోర్(Prashanth Kishore) ఆశిస్తున్నారు. పీకే రాజకీయ వ్యూహకర్తగా చాలా వరకు విజయం సాధించినప్పటికీ, రాజకీయ ఎంట్రీ ఏమేరకు లాభిస్తుందో.. లేదో వేచి చూడాలి.
Read Also: Srinidhi Shetty : KGF బ్యూటీతో నాని జోడి..!
కాగా, ఏపిలో 2019 జరిగిన ఎన్నికలలో జగన్(Jagan) భారీ విజయం వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్న విషయం తెలిసిందే. అయితే 2024లో వైసీపీ ఓడిపోయింది. ఈ విషయాన్ని ప్రశాంత్ కిషోర్ ముందే ఊహించారు. అది మళ్లీ నిజమైంది.
Read Also: Swimmer Rescued : బీచులో మునిగింది.. 80 కి.మీ దూరంలో ప్రాణాలతో తేలింది