Site icon HashtagU Telugu

Rahul Gandhi : రాహుల్‌గాంధీ ప్రసంగంలోని కొంత భాగం కట్.. స్పీకర్ కీలక నిర్ణయం

Rahul Gandhi Speech

Rahul Gandhi : ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్‌సభలో సోమవారం మధ్యాహ్నం చేసిన ప్రసంగంపై రాజకీయ దుమారం రేగింది. ఆయన వ్యాఖ్యలపై లోక్‌‌సభలోనే ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో ఇవాళ కీలక విషయం బయటికి వచ్చింది. రాహుల్ గాంధీ ప్రసంగంలోని కొంత భాగాన్ని తొలగించినట్లు తెలిసింది. దేశంలోని  మైనారిటీలు, మతపరమైన అంశాలు, హిందువులను ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్‌లోని కొంతభాగాన్ని లోక్‌సభ వీడియో ఫుటేజీ నుంచి తొలగించినట్లు సమాచారం.  తొలగించిన వీడియో పార్ట్‌లో ప్రధానమంత్రిపై, బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లపై రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ కూడా ఉన్నాయని అంటున్నారు. శివుడు, గురునానక్, యేసు ప్రభువు, బుద్ధుడు, లార్డ్ మహావీర్‌ల ఫొటోలను చూపిస్తూ రాహుల్ గాంధీ(Rahul Gandhi) మాట్లాడిన భాగాన్ని కూడా వీడియో ఫుటేజీ నుంచి తొలగించారని చెబుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join

ఇవాళ ఉదయం ఎన్డీయే కూటమి పార్లమెంటరీ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ.. ఎంపీలకు కీలక సూచనలు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలా ఎవరూ పార్లమెంటులో ప్రవర్తించకూడదని  కోరారు.  ‘‘ప్రధానమంత్రి పదవికి దూరమై కొందరు ఇష్టం వచ్చినట్టుగా  ప్రవర్తిస్తున్నారు. ఒక టీ అమ్ముకునే వ్యక్తి చేతిలో ఎదురైన ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నారు. వరుసగా మూడుసార్లు ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడం వారికి ఇబ్బంది కలిగిస్తోంది’’ అంటూ ఇండియా కూటమిపై  ప్రధాని మోడీ ఫైర్ అయ్యారు. ఏమీ పట్టించుకోకుండా.. దేశ సేవకు పునరంకితం కావాలని ఎంపీలకు ఆయన పిలుపునిచ్చారు.

Also Read :Rs 8300 Crore Fraud: రూ.8300 కోట్ల కుంభకోణం.. ఇద్దరు భారత సంతతి అమెరికన్లకు జైలు

పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. ‘‘దేశ సేవే లక్ష్యంగా ముందుకు సాగాలని ఎంపీలకు ప్రధాని మోడీ సందేశం ఇచ్చారు. సభలో ఎలా నడుచుకోవాలనే విషయాన్ని ఆయన మార్గనిర్దేశనం చేశారు’’ అని తెలిపారు. పార్లమెంటు నిబంధనలను అనుసరించాలని, పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తిని కొనసాగించాలని మోడీ కోరారని చెప్పారు. లోక్‌సభ స్పీకర్‌ను అవమానించేలా రాహుల్ గాంధీ మాట్లాడారని.. ఎన్డీయే ఎంపీలు అలా చేయొద్దని మోడీ రిక్వెస్ట్  చేశారన్నారు. ఎన్డీఏ పార్లమెంటరీ పక్షం సమావేశాన్ని కూటమిలోని పార్టీల ఎంపీల మధ్య సమన్వయాన్ని పెంచే లక్ష్యంతో నిర్వహించామని కిరణ్ రిజిజు వెల్లడించారు.

Also Read :Zika Virus : పుణేలో ‘జికా’ కలకలం.. ఇద్దరు గర్భిణులకు పాజిటివ్

నా ప్రసంగమంతా తొలగించినా పర్వాలేదు.. నిజం ఎప్పటికీ నిజమే : రాహుల్

లోక్‌సభలో తాను చేసిన ప్రసంగంలో నుంచి కొన్ని వ్యాఖ్యలను పార్లమెంట్‌ రికార్డుల నుంచి తొలగించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ‘‘మోడీ ప్రపంచంలో నిజాలను చెరిపేస్తారు. కానీ వాస్తవ ప్రపంచంలో అది సాధ్యం కాదు. నేను చెప్పాలనుకున్న నిజం చెప్పాను. వారు కావాలంటే అంతా తొలగించుకున్నా పర్వాలేదు. నిజం ఎప్పటికీ నిజమే’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.