India Consulate : ప్రధాని నరేంద్ర మోడీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సంయుక్తంగా ఫ్రాన్స్‌లోని మార్సెయిల్‌లో భారత కొత్త కాన్సులేట్‌ను ప్రారంభించారు. ఈ సందర్బంగా, భారతదేశం-ఫ్రాన్స్‌ల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయని ప్రధానమంత్రి కార్యాలయం (PMO) వెల్లడించింది. ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ, ప్రాంతీయ సమస్యలపై చర్చలు జరిపినట్లు పేర్కొంది. సాంకేతికత, రక్షణ, పౌర అణుఇంధనం, అంతరిక్షం తదితర రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని అంగీకారానికి వచ్చినట్లు సమాచారం.
Read Also: Anti Sikh Riots : సిక్కుల ఊచకోత కేసు..దోషిగా మాజీ ఎంపీ
ఈ కార్యక్రమానికి ముందు, ప్రధాని మోడీ మేక్రాన్‌తో కలిసి భారత వీర వీరుల స్మారక స్థూపానికి నివాళులు అర్పించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారత జవాన్ల త్యాగాలను గుర్తుగా, ఫ్రాన్స్ ప్రభుత్వం మార్సెయిల్‌లో ప్రత్యేక యుద్ధ స్మారకాన్ని నిర్మించింది. దీనిని కామన్వెల్త్ వార్ గ్రేవ్స్ కమీషన్ (CWGC) నిర్వహిస్తోంది. ఇక, ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా, మోడీ పారిస్‌లో నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ కమిటీ (AI సమ్మిట్) సమావేశంలో సహ అధ్యక్షుడిగా వ్యవహరించారు. వివిధ దేశాధినేతలు, టెక్నాలజీ నిపుణుల సమక్షంలో ప్రసంగించారు.
ఇకపోతే..ఈరోజుతో ఫ్రాన్స్ పర్యటనను ముగించుకొని ప్రధాని మోడీ సాయంత్రానికి అమెరికాకు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అవుతారు. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి భేటీ కానున్న ప్రధాని మోడీ.. పలు అంశాలపై చర్చలు జరిపే అవకాశముంది. పలు దేశాలపై ట్రంప్ టారిఫ్‌లు విధిస్తున్న నేపథ్యంలో మోడీ అమెరికా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ద్వైపాక్షిక సంబంధాలు,వ్యాపార విధానాలు,ట్రంప్ ప్రభుత్వం అమలు చేస్తున్న టారిఫ్‌ల వంటి కీలక అంశాలపై వారు చర్చించే అవకాశముంది.
Read Also: New Income Tax Bill: రేపు లోక్‌సభ ఎదుటకు నూతన ఐటీ బిల్లు.. దానిలో ఏముంది ?