Railway Tracks : జార్ఖండ్‌లో గుర్తు తెలియని దుండగులు పేట్రేగారు. సాహిబ్‌గంజ్ జిల్లాలో బొగ్గు సప్లై కోసం వినియోగించే రైల్వే ట్రాక్‌లో కొంత భాగాన్ని పేల్చేశారు. ఈ ఘటనలో 470 సెం.మీల మేర రైల్వే ట్రాక్ దెబ్బతింది. ఈ రైల్వే ట్రాక్‌ను ఎన్టీపీసీ కంపెనీ ఉపయోగిస్తోంది. జార్ఖండ్‌లోని గోడ్డాలో ఉన్న లాల్‌మాటియా నుంచి పశ్చిమ బెంగాల్ ఫరక్కాలోని పవర్ స్టేషన్‌కు బొగ్గును సప్లై చేసేందుకు ఈ ట్రాక్‌ను ఎన్టీపీసీ(Railway Tracks) వాడుతోంది. ఈ రైల్వే ట్రాక్ భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో భాగం కాదు అని అధికార వర్గాలు తెలిపాయి.
Also Read :Isha Foundation : సన్యాసులుగా మారమని మేం ఎవరికీ చెప్పం: ఈశా ఫౌండేషన్
వైజాగ్ కేంద్రంగా రైల్వే జోన్
రైల్వే పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ సీఎం రమేశ్ కీలక వివరాలను వెల్లడించారు. త్వరలోనే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌కు భూమి పూజ జరుగుతుందని ఆయన తెలిపారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రైల్వే జోన్ కార్యాలయం, ఇతర కార్యకలాపాలకు కావాల్సిన భూమిని రైల్వే శాఖకు అందించారని చెప్పారు. ఏపీలో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి కోసం తనవంతుగా కృషి చేస్తానని సీఎం రమేశ్ పేర్కొన్నారు.
Also Read :Moringa Ladoo : మునగ లడ్డూ తింటే ఆ రెండు సమస్యలు పరార్
రైల్వే స్టేషన్లకు ఉగ్ర వార్నింగ్
జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ జమ్మూకశ్మీర్ ఏరియా కమాండర్ మహ్మద్ సలీం అన్సారీ పేరుతో రాజస్థాన్‌లోని హనుమాన్ ఘర్ జంక్షన్‌లోని స్టేషన్ సూపరింటెండెంట్‌కు ఓ హెచ్చరిక లేఖ అందింది. రాష్ట్రంలోని శ్రీ గంగానగర్, హనుమాన్ ఘర్, బికనీర్, జోధ్‌పూర్, కోట, బుందీ, ఉదయర్‌పూర్, జైపూర్ రైల్వే స్టేషన్‌లలో ఈనెల 30న బాంబు దాడులు చేస్తామని అందులో హెచ్చరించారు. కశ్మీరులో జిహాదీల మరణాలకు ప్రతీకారంగా ఈ దాడులు చేయబోతున్నట్లు లేఖలో పేర్కొన్నారు.దీంతో ఆయా రైల్వే స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. తనిఖీల్లో అనుమానాస్పద వస్తువులే లభించలేదు.