Site icon HashtagU Telugu

Bihar Next CM : లాలూ కుమారుల ఢీ.. ‘‘నెక్ట్స్ సీఎం నేనే’’ అంటూ తేజ్‌ప్రతాప్ సంచలన వీడియో

Bihar Next Cm Tej Pratap Yadav Tejashwi Yadav Lalu Prasad Yadav Bihar Politics Rjd

Bihar Next CM : బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది అక్టోబరులో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కీలకమైన రాజకీయ శక్తిగా ఉన్న రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జేడీ)లో ఏదో జరుగుతోంది. ఈ దిశగా సంకేతాలు ఇచ్చేలా ఓ కీలక పరిణామం ఇవాళ చోటుచేసుకుంది. ఆర్‌జేడీ అగ్రనేత, లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ‘ఎక్స్’ వేదికగా సంచలన పోస్ట్ పెట్టారు. ‘బిహార్‌కు కాబోయే సీఎం మీ ముందే కూర్చొని ఉన్నాడు’’ అని ఆ పోస్ట్‌లో ఆయన రాసుకొచ్చారు. ఇప్పుడు దీనిపై ఆర్‌జేడీతో పాటు బిహార్‌లోని రాజకీయ వర్గాల్లో వాడివేడి చర్చ జరుగుతోంది.  ఇవాళ ఆర్‌జేడీకి సంబంధించిన నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశం జరుగుతున్న వేళ తేజ్ ప్రతాప్ యాదవ్ పెట్టిన పోస్ట్ రాజకీయ కాకను రాచేసింది.

Also Read :Jupiter 125 CNG : ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ స్కూటర్‌.. ‘జూపిటర్‌ 125 సీఎన్‌జీ’ ఫీచర్లు ఇవీ

ఈ వీడియోలో తేజ్ ప్రతాప్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బిహార్‌లోని ప్రస్తుత ప్రభుత్వాన్ని త్వరలోనే గద్దె దింపుతామన్నారు. తదుపరి సీఎం మీ ముందే కూర్చొని ఉన్నాడని చెప్పుకొచ్చారు. ఏ ఉద్దేశంతో తేజ్ ప్రతాప్ ఈ కామెంట్స్ చేశారు ? సీఎం అభ్యర్థి(Bihar Next CM) విషయంలో సోదరుడు తేజస్వి యాదవ్‌తో తేజ్ ప్రతాప్ పోటీపడుతున్నారా ? అనే కోణంలో చర్చ నడుస్తోంది. ఆర్‌జేడీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశం వేదికగా తేజస్వి యాదవ్‌కు కీలక బాధ్యతలను అప్పగించేందుకు లాలూ ప్రసాద్ యాదవ్ రెడీ అవుతున్నట్లు సమాచారం. దీంతోపాటు బిహార్‌లో ఇండియా కూటమి తరఫున సీఎం అభ్యర్థిగా తేజస్విని ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈనేపథ్యంలో రంగంలోకి దిగిన తేజ్ ప్రతాప్ యాదవ్ తానే సీఎం అభ్యర్థిని అని ప్రచారం చేసుకుంటుండటం గమనార్హం. దీనివల్ల ఆర్‌జేడీ శ్రేణుల్లో అయోమయం ఏర్పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also Read :Formula E Car Race Case : ఫార్ములా-ఈ కార్ రేసు స్కాం.. ఒప్పందం కంటే ముందే రూ.45 కోట్ల చెల్లింపులు!