New Covid Variants: మరో రెండు కొత్త కరోనా వేరియంట్లు మనదేశంలో వెలుగుచూశాయి. ఎన్‌బీ.1.8.1, ఎల్‌ఎఫ్.7 అనే కొత్త కొవిడ్ వేరియంట్లను గుర్తించామని ‘ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం’ (INSACOG) ఈరోజు (శనివారం) వెల్లడించింది. ఎన్‌బీ.1.8.1 వేరియంట్‌కు చెందిన ఒక కరోనా కేసు ఏప్రిల్‌లో, ఎల్‌ఎఫ్.7 వేరియంట్‌కు చెందిన నాలుగు కరోనా కేసులు మేలో గుర్తించామని తెలిపింది. ఈకేసులు తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో బయటపడ్డాయని పేర్కొంది.
Also Read :Taj Mahal Inspired Mosque : రూ.50 కోట్లతో తాజ్‌మహల్ లాంటి మసీదు.. ఎక్కడో తెలుసా ?
అలర్ట్ మోడ్‌లో ఆ రాష్ట్రాలు
ప్రస్తుతం ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత మూడేళ్లలో తొలిసారిగా ఢిల్లీలో 23 మందికి కరోనా వైరస్ సోకింది. దాంతో అక్కడి ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ప్రభుత్వ ఆస్పత్రులను అప్రమత్తం చేశాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు, టెస్టింగ్ కిట్స్, వ్యాక్సిన్ల లభ్యతను పెంచుతున్నారు. వివిధ రకాల శ్వాసకోశ వైరస్ కేసుల వివరాలను పకడ్బందీగా నమోదు చేస్తున్నారు. రోగులను వైద్యుల అబ్జర్వేషన్‌లో ఉంచుతున్నారు. వైరస్ వేరియంట్లలో జరిగిన మార్పుల వల్లే అవి మళ్లీ ఇన్ఫెక్షన్‌ను వ్యాప్తి చేయగలుగుతున్నాయని పలువురు వైద్య నిపుణులు అంటున్నారు.
Also Read :Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి.. ఏపీ, తెలంగాణలకు రెయిన్ అలర్ట్
ఈ లక్షణాలతో కరోనా ఇన్ఫెక్షన్లు
కరోనా బారినపడుతున్న వారిలో జ్వరం, ముక్కు కారడం, గొంతునొప్పి, తలనొప్పి, నీరసం వంటి స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయి. బాధితులు నాలుగు రోజుల్లో కోలుకుంటున్నారు. ఇప్పుడు దేశంలో కరోనా కేసులు(New Covid Variants) నమోదవుతున్నప్పటికీ, వాటి తీవ్రత తక్కువగానే ఉందని ఇటీవలే కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. అయినా అప్రమత్తంగా ఉంటూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని తెలిపింది.ప్రస్తుతం జేఎన్.1 రకం కరోనా వేరియంట్ వల్లే ఆసియా దేశాల్లో వైరస్ వ్యాపిస్తోందని చెబుతున్నారు.అది ఆందోళన కలిగించే వేరియంట్ కాదని ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇదివరకే క్లారిటీ ఇచ్చింది.