Viral Video : సీఎం మాన్‌పై కుమార్తె సంచలన ఆరోపణలు.. వీడియో వైరల్

Viral Video : పంజాబ్ సీఎం​ భగవంత్​ సింగ్​ మాన్​ మరోసారి చిక్కుల్లో పడ్డారు.  తన తండ్రి మూడోసారి తండ్రి కాబోతున్నాడు అంటూ  సీఎం మాన్​పై ఆయన కుమార్తె సీరత్​ కౌర్ సంచలన ఆరోపణలు చేశారు.

  • Written By:
  • Updated On - December 10, 2023 / 12:28 PM IST

Viral Video : పంజాబ్ సీఎం​ భగవంత్​ సింగ్​ మాన్​ మరోసారి చిక్కుల్లో పడ్డారు.  తన తండ్రి మూడోసారి తండ్రి కాబోతున్నాడు అంటూ  సీఎం మాన్​పై ఆయన కుమార్తె సీరత్​ కౌర్ సంచలన ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను ఆమె సోషల్​ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. ‘‘మా నాన్న(సీఎం మాన్) మూడోసారి తండ్రి కాబోతున్నారని సన్నిహిత వర్గాల ద్వారా మాకు తెలిసింది. తన కుటుంబ బాధ్యతలనే సరిగ్గా నిర్వహించలేని వ్యక్తి మరొకరికి న్యాయం ఎలా చేస్తారు ? నాన్న.. నమ్మిన వారిని మోసం చేయొద్దు’’ అని తండ్రిని సీరత్ కౌర్​ కోరారు. ‘‘మా నాన్న మొదటి నుంచీ మాతో అబద్ధాలే చెబుతున్నారు. ఇప్పుడు పంజాబ్​ ప్రజలతో కూడా అదే చేస్తున్నారు. నాకు చేసిన అన్యాయమే పంజాబ్​ ప్రజలకు చేస్తున్నారు. నాకు ఆయన పేరును కూడా ఆపాదించవద్దు. మా అమ్మతో విడాకులు వేరే కథ. మా అమ్మను ఎమోషనల్​గా వీక్​ చేసినట్లే, ఇప్పుడు పంజాబ్​ ప్రజలను చేస్తున్నారు’’ అని సీరత్ కౌర్ ఆరోపించారు. ‘‘సీఎం మాన్ ఇప్పటికీ విధానసభకు, గురుద్వారా సాహెబ్​కు మద్యం మత్తులోనే వెళ్తున్నారు. సొంత పిల్లలకే న్యాయం చేయలేని వ్యక్తి, రాష్ట్రానికి ఏం మంచి చేస్తారు?’’ అని ఆమె ప్రశ్నను సంధించారు.

We’re now on WhatsApp. Click to Join.

సీరత్​ కౌర్ వీడియోను(Viral Video) ఆమె తల్లి (భగవంత్ మాన్​ మొదటి భార్య) సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ దేవుడే పంజాబ్​ ప్రజలను రక్షించాలంటూ తన మాజీ భర్తపై ఆమె పరోక్ష విమర్శలు గుప్పించారు. తాను ఈ వీడియోను తప్పనిసరి పరిస్థితుల్లో పోస్ట్ చేయాల్సి వచ్చిందన్నారు. తనకు, తన కూతురికి రాజకీయాలు చేసే ఉద్దేశం లేదన్నారు. ‘‘కొన్నిసార్లు నిశబ్దంగా ఉండడం కూడా నేరమే. అందుకే మేం సీఎం మాన్ గురించి నోరువిప్పాం’’ అని భగవంత్ మాన్​ మొదటి భార్య చెప్పారు. ‘‘విడాకులు తీసుకుంటే తండ్రిగా ఎలాంటి బాధ్యతలు ఉండవని ఏ చట్టం చెబుతోంది ?’’ అని సీఎం మాన్‌ను ఆమె ప్రశ్నించారు. ‘‘పంజాబ్ కోసం కుటుంబాన్ని విడిచిపెట్టానని చెబుతున్న ఓ కళాకారుడిని ప్రజలు అర్థం చేసుకోవడం లేదు. ఒకవేళ పంజాబ్​ కోసమే సీఎం మాన్ కుటుంబాన్ని విడిచిపెట్టి ఉంటే.. మరొకరిని ఎలా పెళ్లి చేసుకుంటారు. దయచేసి ఇకనైనా డ్రామాలు మానండి’’ అని సీఎం మాన్‌కు మొదటి భార్య హితవు పలికారు.