Site icon HashtagU Telugu

Brand Raja : ‘బ్రాండ్’ రాజా.. బాలీవుడ్ బాద్షా, బిగ్‌ బీలను వెనక్కి నెట్టేసిన ధోనీ

Brand Raja Ms Dhoni Amitabh Bachchan Shah Rukh Khan

Brand Raja : సినిమా రంగ సెలబ్రిటీలు, క్రీడారంగ సెలబ్రిటీలు వివిధ కంపెనీల బ్రాండ్‌లను ప్రమోట్ చేస్తూ భారీగా డబ్బులు సంపాదిస్తుంటారు. ఈవిషయంలో సెలబ్రిటీల మధ్య భారీ పోటీ ఉంటుంది. భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోనీ బ్రాండ్ ప్రమోషన్లతో  దుమ్ము రేపుతున్నాడు. అత్యధిక సంఖ్యలో బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్న కాస్ట్లీ సెలబ్రిటీగా సరికొత్త రికార్డును ఆయన సొంతం చేసుకున్నారు. బ్రాండ్లను ప్రమోట్ చేసి భారీగా కాసులు పోగేసుకుంటున్న సెలబ్రిటీల లిస్టులో ఇంతకుముందు వరకు బాలీవుడ్ స్టార్లే టాప్ ప్లేసుల్లో ఉండేవారు.  అయితే ఈసారి వాళ్లందరినీ ధోనీ దాటేశాడు.

Also Read :Harish Rao : ఫోన్ ట్యాపింగ్ కేసు.. తెలంగాణ హైకోర్టులో హరీశ్‌రావుకు ఊరట

ఈ సంవత్సరం జనవరి నుంచి జూన్ మధ్యకాలంలో ధోనీ(Brand Raja) ఏకంగా 42 ప్రముఖ కంపెనీల బ్రాండ్లకు ప్రచార కర్తగా వ్యవహరించాడు. తద్వారా కోట్లాది రూపాయల ఆదాయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. టామ్ మీడియా రీసెర్చ్ అనే సంస్థ ఈవివరాలతో ఒక నివేదికను విడుదల చేసింది.దీని ప్రకారం..  వివిధ కంపెనీల బ్రాండ్ల కోసం ప్రచారం చేసే విషయంలో అమితాబ్‌, షారుక్‌ను ధోనీ దాటేశారు. కొన్ని ఆటోమొబైల్ కంపెనీలకు చెందిన లగ్జరీ కార్ల యాడ్స్‌ను ధోనీ చేశారు. ఇటీవలే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘంతో కలిసి ప్రజలకు ఓటు విలువను తెలియజేసే ప్రచారంలో భాగమయ్యారు. ఓరియంట్ ఎలక్ట్రిక్, పెప్సీ కో, మాస్టర్‌ కార్డ్‌, గల్ఫ్‌ఆయిల్, ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన క్లియర్‌ట్రిప్‌, డ్రోన్ స్టార్టప్‌ గరుడ ఏరోస్పేస్, సిట్రాన్ వంటి కంపెనీలకు ధోనీ ప్రచారకర్తగా ఉన్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్‌లో కూడా ధోనీ కనిపించబోతున్నాడు. ఆ ఎఫెక్టుతో రానున్న ఆరు నెలల్లో ధోనీకి మరింత  ప్రమోషన్ వర్క్ లభించే అవకాశం ఉంది.

Also Read :Indiramma Houses Survey App : ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో వారికే ప్రయారిటీ : సీఎం రేవంత్

ధోనీ స్క్రీన్ ప్రజెన్స్ తక్కువే అయినా.. 

ప్రతిరోజు ధోనీ స్క్రీన్ ప్రజెన్స్ కేవలం 14 గంటలే.  ప్రతిరోజు నటులు అక్షయ్ కుమార్ స్క్రీన్ ప్రజెన్స్ 22 గంటలు, షారుక్ 20 గంటలు, అమితాబ్‌ 16 గంటలు చొప్పున ఉంటుంది. స్క్రీన్ ప్రజెన్స్ తక్కువే ఉన్నా ధోనీ అత్యధికంగా 42 బ్రాండ్ల కోసం ప్రచారం చేస్తున్నారు. ధోనీ తర్వాతి స్థానాల్లో అమితాబ్‌ ఉన్నారు. ఆయన  ప్రస్తుతం 41  బ్రాండ్ల కోసం ప్రచారం చేస్తున్నారు. షారుక్ ఖాన్ 34 బ్రాండ్ల కోసం ప్రచారం చేస్తున్నారు.  అక్షయ్ కుమార్ 28 బ్రాండ్ల కోసం, సౌరభ్‌ గంగూలీ 24  బ్రాండ్ల కోసం, విరాట్ కోహ్లీ 21 బ్రాండ్ల కోసం, రణ్‌వీర్‌ సింగ్‌ 21 బ్రాండ్ల కోసం ప్రచారం చేస్తున్నారు.