Modi@1: మన మోడీ వరల్డ్ నంబర్ 1

ప్రపంచ దేశాధ్యక్షులను వెనక్కి నెట్టి అందరికీ కంటే టాప్ ప్లేస్ (Top Place) లో మన ప్రధాని మోడీ నిలిచారు.

Published By: HashtagU Telugu Desk
Pm Modi

Pm Modi

ఇప్పటికే ఇండియాలో (India) తిరుగులేని నేతగా చలామణి అవుతున్న ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) మరోసారి తానేంటో చాటుకున్నాడు. ప్రపంచ దేశాల అధ్యక్షులను వెనక్కి నెట్టి అందరికీ కంటే టాప్ ప్లేస్ (Top Place) లో నిలిచాడు. ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం ప్రపంచ నాయకుల ఆమోదం రేటింగ్ ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ (Narendar Modi) అగ్రస్థానంలో నిలిచారు. బిజినెస్ ఇంటెలిజెన్స్ కంపెనీ మార్నింగ్ కన్సల్ట్ జనవరి 26-31 మధ్య నిర్వహించిన ఈ సర్వేలో యునైటెడ్ కింగ్‌డమ్ పీఎం రిషి సునక్, యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్జో బైడెన్ తో సహా 22 మంది ప్రపంచ నాయకులు ఉన్న జాబితాలో భారత ప్రధాని 1వ (Number 1) స్థానంలో నిలవడం గమనార్హం.

78 శాతం ఆమోదం రేటుతో భారత ప్రధాని (India PM) నంబర్ 1, మెక్సికో ప్రెసిడెంట్ లోపెజ్ ఒబ్రాడోర్, ఆస్ట్రేలియా PM ఆంథోనీ అల్బనీస్ వరుసగా 68 శాతం, 58 శాతంతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇటలీ (Italy) ప్రధాని జార్జియా మెలోని 52 శాతం రేటింగ్‌లో  నాలుగో స్థానంలో ఉన్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డి సిల్వా ఐదవ స్థానంలో నిలిచారు. US అధ్యక్షుడు జో బిడెన్, కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో 40% సాధారణ రేటింగ్‌తో ఆరు, ఏడవ స్థానాల్లో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా (World) ఆమోదం పొందిన నేతల్లో మోడీ (Narendar Modi) టాప్ ప్లేస్ కొనసాగడం పట్ల బీజేపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Kalyan Ram: నేను ఎవరిని బెదిరించను.. ఐ జస్ట్ కిల్!

  Last Updated: 04 Feb 2023, 01:37 PM IST