బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట (Bengaluru Stampede) దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోవడం (11 Dies) పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi), ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది హృదయ విదారక ఘటనగా పేర్కొంటూ మోడీ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం, గాయపడిన వారికి రూ.50 వేల సాయం ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
TDP Govt: కూటమి మరో సంచలన నిర్ణయం.. 15 లక్షల ‘బంగారు కుటుంబాలు’ దత్తత!
ఇదే విషాదంపై సీఎం చంద్రబాబు మరియు ఉప సీఎం పవన్ కల్యాణ్ కూడా తమ స్పందనను సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరిచారు. ఈ దుర్ఘటనను అత్యంత బాధాకరమని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా చిన్నారుల మృతి వార్తను పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదనతో స్వీకరించారు. “విజయోత్సవాల్లో ఇలాంటి విషాదం జరగడం బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి” అని పవన్ పేర్కొన్నారు. వేడుకలు ఉత్సాహంగా ఉండాలే కానీ, ఇలా ప్రాణాలు పోగొట్టేలా ఉండకూడదని వారి స్పందనలో స్పష్టమైంది.
Virat Kohli: కోహ్లీ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. విరాట్‌ను చూడాలంటే ఆగస్టు వరకు ఆగాల్సిందే!
ఇదిలా ఉండగా ఈ దుర్ఘటనపై కర్ణాటకలో రాజకీయ ఆరోపణలు ప్రారంభమయ్యాయి. ప్రతిపక్ష బీజేపీ ఈ ఘటనకు సిద్ధరామయ్య ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తోంది. తగిన భద్రతా చర్యలు లేకుండా, సరైన ప్రణాళిక లేకుండా భారీ జనాన్ని సమీకరించడం వల్లే ఈ దురాంతం చోటుచేసుకుందని ఆరోపించింది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సామాజిక, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు తమ విచారం తెలియజేశారు. ఈ ఘటన భవిష్యత్‌లో మరెక్కడా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం స్పష్టమవుతోంది.