మహారాష్ట్రలో చోటుచేసుకున్న ఘోర సంఘటన సమాజాన్ని కుదిపేసింది. పాలఘర్ జిల్లాకు చెందిన నీలేశ్ ధోంగ్డా అనే యువకుడి వివాహ నిశ్చితార్థం బిబల్దార్ ప్రాంతానికి చెందిన ఒక మైనర్ బాలికతో జరిగింది. పెళ్లి నిశ్చయమైనప్పటికీ, ఆ యువకుడు పెళ్లి ముందు నుంచే ఆమెపై శృంగార ఒత్తిడి తీసుకొచ్చాడు. అయితే ఆ బాలిక ఒప్పుకోకపోవడంతో నీలేశ్ ఘోరానికి ఒడిగట్టాడు.
ఒక రోజు ఆ బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో నీలేశ్ ఆమె ఇంటికి వెళ్లాడు. శారీరక సంబంధం కోసం ఒత్తిడి చేయగా, ఆమె నిరాకరించింది. కోపంతో నీలేశ్ ఆమెపై అత్యాచారం చేసి, అనంతరం క్రూరంగా గొంతు నులిమి హతమార్చాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది.
Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి
తన కుమార్తె మిస్సింగ్ అవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు, అనుమానాస్పద పరిస్థితుల్లో ఆమె మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరిపి నిందితుడిని అరెస్టు చేశారు. ఇలాంటి సంఘటనలు సమాజంలో బాలికల భద్రతపై మళ్లీ ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. మహిళలపై పెరుగుతున్న లైంగిక దాడులను అరికట్టేందుకు కఠిన చట్టాలు, కఠినమైన శిక్షలు తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు.