Sukhbir Singh Badal : పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, శిరోమణి అకాలీదళ్ పార్టీ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై హత్యాయత్నం జరిగింది. ఆయనపై నరైన్ సింగ్ చౌరా అనే వృద్ధుడు కాల్పులకు తెగబడ్డాడు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న ప్రఖ్యాత స్వర్ణ దేవాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సుఖ్బీర్ సింగ్‌కు కొన్ని అడుగుల దూరంలో నిలబడిన సదరు వృద్ధుడు తన ప్యాంటు జేబులో నుంచి తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. దీన్ని గమనించి అప్రమత్తమైన సుఖ్బీర్ వ్యక్తిగత సిబ్బంది వెంటనే సదరు వృద్ధుడిని అడ్డుకొని పక్కకు తీసుకెళ్లారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఆ వృద్ధుడిని భద్రతా సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సుఖ్బీర్‌కు ఎలాంటి హానీ జరగలేదు. నిందితుడు నరైన్ సింగ్ చౌరా గతంలో బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ అనే ఉగ్రవాద సంస్థలో పనిచేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే అకల్ తఖ్త్ విధించిన శిక్షను పాటిస్తూ స్వర్ణ దేవాలయంలో సెక్యూరిటీ గార్డుగా సుఖ్బీర్ సింగ్ బాదల్(Sukhbir Singh Badal) సేవలు అందిస్తుండగా.. ఈ హత్యాయత్నం జరిగింది. కాలికి గాయం కావడంతో ఆయన నడవలేక వీలై ఛైర్‌పైనే ఉంటున్నారు.
పంజాబ్ గోల్డెన్ టెంపుల్లో కాల్పులు శిరోమణి ఆకాలీదల్ అధ్యక్షుడి పై హత్యాయత్నం సుఖ్బీర్ సింగ్ బాదల్ పై కాల్పులకు దుండగుడు యత్నం కాల్పులను అడ్డుకున్న సుఖ్బీర్ సింగ్ బాదల్ అనుచరులు#Punjab #goldentemple #amritsar #amritsargoldentemple #HashtagU pic.twitter.com/hbUl4yoJ6O
— Hashtag U (@HashtaguIn) December 4, 2024
Also Read :Martial Law Chaos : దక్షిణ కొరియాలో ‘ఎమర్జెన్సీ’ కలకలం.. దేశాధ్యక్షుడు ఏం చేయబోతున్నారంటే..
ఎవరీ నరైన్ సింగ్ ?
పంజాబ్‌కు చెందిన నరైన్ సింగ్ 1984లో సరిహద్దులు దాటి పాకిస్తాన్‌కు వెళ్లాడని తెలుస్తోంది. పాకిస్తాన్ నుంచి పంజాబ్‌లోకి అక్రమ ఆయుధాలు, పేలుడు పదార్థాలను తరలించే పనిని ఇతడు చేస్తున్నాడని అంటున్నారు. నరైన్ సింగ్ పాక్ నుంచి తిరిగొచ్చాక.. పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. కొన్నాళ్ల పాటు జైలుశిక్ష కూడా అనుభవించాడు.
Also Read :Earthquake : తెలంగాణ, ఏపీలలో భూప్రకంపనలు.. ఇళ్ల నుంచి బయటకు జనం పరుగులు
2007-17 మధ్య కాలంలో పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్ పార్టీ అధికారంలో ఉంది. ఆ సమయంలో సిక్కుల మనోభావాలను దెబ్బతీసేలా ఆ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. వాటిపై విచారణ నిర్వహించిన సిక్కుల అత్యున్నత సంస్థ ‘అకల్ తఖ్త్’ ఇటీవలే కీలక ఆదేశాలు ఇచ్చింది. పార్టీ చీఫ్ సుఖ్బీర్‌ను దోషిగా తేల్చింది. ఐదు గురుద్వారాల్లో సెక్యూరిటీ గార్డుగా, చెప్పులు క్లీన్ చేసే విభాగంలో, పాత్రలు క్లీన్ చేసే విభాగంలో పనిచేయాలనే శిక్షలను ఆయనకు విధించింది.