Site icon HashtagU Telugu

Maharashtra New CM : డిసెంబరు 5న కొలువుతీరనున్న ‘మహాయుతి’ సర్కారు.. సీఎంగా ఆయనకే ఛాన్స్!

Mahayuti Govt Maharashtra Cm Oath Eknath Shinde Devendra Fadnavis

Maharashtra New CM :  మహారాష్ట్ర సీఎం పదవిపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. ఈ కీలకమైన పదవి బీజేపీకి దక్కడం ఖాయమైంది. అయితే దేవేంద్ర ఫడ్నవిస్‌తో పాటు బీజేపీ నేతలు మురళీధర్‌, వినోద్ తావ్డే, రాధాకృష్ణ విఖే పాటిల్  వంటి నేతలు సీఎం రేసులో ఉన్నారని తెలుస్తోంది. అయినప్పటికీ తదుపరి సీఎం అయ్యే ఛాన్స్ మాత్రం ఫడ్నవిస్‌కే ఎక్కువగా ఉందని సమాచారం. ఎందుకంటే.. ఫడ్నవిస్ గతంలో రెండు సార్లు సీఎంగా వ్యవహరించారు.  ఈయన ఒకసారి డిప్యూటీ సీఎంగా సైతం బాధ్యతలు నిర్వర్తించారు.

Also Read :Priyanka Gandhi : ‘‘మీకోసం నా ఇల్లు, ఆఫీసు తెరిచే ఉంటాయి’’.. వయనాడ్ ప్రజలతో ప్రియాంకాగాంధీ

డిసెంబరు 2న మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలంతా  సమావేశమై పార్టీ శాసనసభా పక్ష నేతను(Maharashtra New CM) ఎన్నుకునే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని దక్కించుకునే వ్యక్తికే సీఎం అయ్యే ఛాన్స్ వరిస్తుంది. ఇక డిసెంబరు 5న ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో సీఎం ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. మహాయుతి కూటమిలోని బీజేపీ, ఎన్‌సీపీ, శివసేనలకు మంత్రి పదవుల కేటాయింపుపైనా డిసెంబరు 2కల్లా క్లారిటీ వస్తుందని అంటున్నారు.

Also Read :US Defence Minister : ‘నా కొడుకుకు మహిళలంటే చులకనభావం’.. కాబోయే రక్షణమంత్రిపై తల్లి విమర్శలు

మహారాష్ట్ర హోంశాఖ, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖలను మాజీ సీఎం ఏక్‌నాథ్ షిండే ఆశిస్తున్నారు. అయితే హోం శాఖను తన వద్దే ఉంచుకుంటానని దేవేంద్ర ఫడ్నవిస్ వాదిస్తున్నారు. దీంతో అలకబూనిన షిండే తన సొంతూరికి వెళ్లిపోయారు. మహాయుతి కూటమిలోని ముఖ్య నేతల సమావేశానికి సైతం ఆయన గైర్హాజరయ్యారు. ఇంకొన్ని గంటల్లో మీడియా సమావేశం నిర్వహించి షిండే కీలక ప్రకటన చేస్తారనే అంచనాలు వెలువడుతున్నాయి.మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 సీట్లు ఉన్నాయి. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 230 సీట్లను మహాయుతి కూటమి కైవసం చేసుకుంది. బీజేపీ 132 సీట్లను, శివసేన (షిండే) 57, ఎన్సీపీ (అజిత్) 41 సీట్లను సాధించాయి.

Also Read :Sudhakar Reddy Udumula: డీప్ ఫేక్ లకు అడ్డుకట్ట పడాలంటే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లు ఇన్ బిల్ట్ ఆల్గారిథమ్ తీసుకురావాలి