Hindu Mutton Shops: మటన్, చికెన్ సహా చాలా ఆహార ఉత్పత్తులకు హలాల్ సర్టిఫికేషన్ ఉండటం మనకు తెలుసు. మహారాష్ట్రలోని మహాయుతి ప్రభుత్వం ఇప్పుడు ‘మల్హర్ సర్టిఫికేషన్’ను తీసుకొచ్చింది. హిందూ మాంసం వ్యాపారులకు ఈ సర్టిఫికేషన్‌ను సర్కారు మంజూరు చేయనుంది. హలాల్ చేయకుండా నేరుగా ఝట్కాతో హిందూ పద్ధతుల్లో గొర్రెలు, మేకలను కోసే మటన్ దుకాణాలకు ‘మల్హర్ సర్టిఫికేషన్’ ఇవ్వనున్నారు. యజమానులు, వర్కర్లు పూర్తిగా హిందువులే ఉన్న షాపులు మాత్రమే ఈ సర్టిఫికెట్‌ను పొందేందుకు అర్హులు. గొర్రెలు, మేకలను కోయడం దగ్గరి నుంచి వాటిని కస్టమర్లకు విక్రయించడం దాకా అన్ని పనులూ హిందువులే చేయాలని ‘మల్హర్ సర్టిఫికేషన్’ నిబంధనల్లో పొందుపరిచారు.
Also Read :Dalai Lama Vs China: భారత్‌లో నా వారసుడు.. దలైలామా ప్రకటన.. చైనా భగ్గు
నితీశ్ రాణే కీలక వ్యాఖ్యలు
మహారాష్ట్రలోని హిందువులు(Hindu Mutton Shops), సిక్కులకు హలాల్ కాని మాంసం అందుబాటులోకి తెచ్చేందుకే ఈ ప్రయత్నమని రాష్ట్ర మత్స్య, ఓడరేవుల అభివృద్ధి శాఖ మంత్రి నితీశ్ రాణే వెల్లడించారు. మాంసం వ్యాపారం చేసే హిందువులను ఒకే వేదికపైకి తెచ్చేందుకు ‘మల్హర్ సర్టిఫికేషన్’ ఉపయోగపడుతుందన్నారు. Malharcertfication.com వెబ్‌సైట్ ద్వారా సర్టిఫికెట్ల కోసం అప్లై చేసుకోవాలని మటన్ షాపుల నిర్వాహకులకు ఆయన పిలుపునిచ్చారు.
మల్హర్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లోని నిబంధనలు
- మల్హర్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ప్రకారం.. మల్హర్-సర్టిఫైడ్ మాంసం అంటే తాజాది. శుభ్రమైనది. ఇతర జంతువుల మాంసంతో కలపబడనిది.
- ఈ సర్టిఫికేషన్ కింద హిందూ ఖతిక్ కమ్యూనిటీకి చెందిన విక్రేతలకు మాత్రమే సర్టిఫికేషన్ ఇస్తారు.
- ఇటీవలి కాలంలో హలాల్ కాని మాంసం ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది.
- గత ఏడాది నవంబరులో ఎయిరిండియా హిందూ, సిక్కు ప్రయాణికులకు నాన్ హలాల్ భోజనం అందించాలని నిర్ణయించింది.