Maharashtra Divide: మహా వికాస్ ఆగాడీ కథ ముగిసినట్టేనా..?

కాంగ్రెస్‌, NCPలకు ఉద్ధవ్ ఠాక్రే దూరం జరుగుతున్నారా.. ముంబైలో ఇప్పుడిదే హాట్ టాపిక్‌.

  • Written By:
  • Updated On - January 24, 2023 / 11:10 AM IST

కాంగ్రెస్‌, NCPలకు ఉద్ధవ్ ఠాక్రే దూరం జరుగుతున్నారా..ముంబైలో ఇప్పుడిదే హాట్ టాపిక్‌. BMC ఎన్నికల కోసం కొత్త పొత్తుకు ఠాక్రే తెరతీయడంతో.. MVA విచ్ఛిన్నానికి ముహూర్తం దగ్గరపడిందన్న వార్తలు జోజోరందుకున్నాయి. మహారాష్ట్రలో కొత్త రాజకీయ కూటమి ఏర్పాటైంది. మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే – బీఆర్‌ అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్‌ చేతులు కలిపారు. బృహన్‌ ముంబై నగర పాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పొత్తు కుదుర్చుకున్నారు. బాలాసాహెబ్ ఠాక్రే జయంతి సందర్భంగా కొత్త కూటమి ప్రకటన చేశారు ఉద్దవ్ ఠాక్రే-ప్రకాశ్ అంబేడ్కర్‌. రెండు పార్టీలతో ఏర్పాటవుతున్న ఈ కూటమి.. రానున్న రోజుల్లో బలమైన ప్రజాపక్షంగా అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

అంబేడ్కర్‌ వంచిత్‌ బహుజన్‌ అగాడీతో ఉద్ధవ్ ఠాక్రే పొత్తు మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌, NCP, శివసేన UBT కలిసి ఏర్పాటుచేసిన మహా వికాస్ అగాడీ భవిష్యత్‌ పశ్నార్థకంగా మారింది. ప్రకాశ్ అంబేడ్కర్‌కు NCPతో సైద్ధాంతిక విభేదాలున్నాయి. కాంగ్రెస్‌తోనూ అంటీ ముట్టనంటే ఉంటారు. దీంతో ఠాక్రే నెమ్మదిగా MVAకు దూరం జరుగుతున్నారా అనే చర్చ ముంబైలో జోరందుకుంది.

Also Read: Suicide : మాజీ హోమంత్రి సుచ‌రిత నివాసంలో ఎస్కార్క్ డ్రైవ‌ర్ ఆత్మ‌హ‌త్య‌

ఉద్ధవ్ ఠాక్రే మాత్రం ప్రకాశ్‌ అంబేడ్కర్‌తో పొత్తు మహా వికాస్ అగాడీలో భాగమే అంటున్నారు. NCP, కాంగ్రెస్‌కు ఈ విషయంలో అభ్యంతరాలు లేవని చెప్పుకొచ్చారు. వారితో చర్చించిన తర్వాత కూటమి నిర్ణయం తీసుకున్నట్టు చెబుతోంది ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం. దీనిపై స్పందించేందుకు నిరాకరించారు శరద్ పవార్‌. పొత్తుల గురించి అజిత్ పవార్‌ మాట్లాడతారంటూ మాట దాటేశారు. దీంతో అగాడీలో చిచ్చు రాజుకున్నట్టేనన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఉద్ధవ్‌ ఠాక్రే, ప్రకాశ్‌ అంబేడ్కర్‌ పొత్తుకు బీజేపీ కౌంటర్‌ ఇచ్చింది. కొత్త కూటములు కట్టడానికి అసలు ఠాక్రే వద్ద ఏం మిగిలిందంటూ ఎద్దేవా చేసింది.