Site icon HashtagU Telugu

Madhya Pradesh : ఏడుస్తూ నిద్ర పాడుచేస్తుందని రెండేళ్ల చిన్నారిని చంపిన పిన్ని

2yrs Kid Dies

2yrs Kid Dies

ఇటీవల కాలంలో చాలామంది ఏ చిన్న విషయాన్నీ , ఘటనను భరించలేక పోతున్నారు..ఉపిక చేసుకోలేకపోతున్నారు. క్షణికావేశంలో ఏంచేస్తున్నారో కూడా అర్ధం కావడం లేదు. చిన్న చిన్న వాటికే ప్రాణాలు తీయడం , ప్రాణాలు తీసుకోవడం చేస్తున్నారు. ప్రతి రోజు ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా వరుసకు పిన్ని అయ్యే మహిళ..రెండేళ్ల చిన్నారి ఏడుస్తూ నిద్ర పాడుచేస్తుందని గొంతు నులిమి చంపిన ఘటన మధ్యప్రదేశ్ (Madhya Pradesh) జబల్ పూర్‌ (Jabalpur city)లో చోటుచేసుకుంది.

We’re now on WhatsApp. Click to Join.

సదరు చిన్నారి (Old niece)కి పిన్ని అంటే ఎంతో ఇష్టం..రోజు తల్లి దగ్గర కాకుండా ఆమె దగ్గరే పడుకునేది. ఆ మహిళ తనకు నిద్ర వస్తుందని, చిన్నారిని తన తల్లి వద్దకు వెళ్లాలని చెప్పింది. చిన్నారి వినకుండా అక్కడే ఉండటంతో చెంపమీద కొట్టింది. దాంతో చిన్నారి గుక్కపట్టి ఏడ్చింది. మరింత ఆగ్రహించిన మహిళ.. చిన్నారిని గొంతు పిసికి చంపేసింది. ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు.. చిన్నారి మృతదేహాన్ని సోఫా (Sofa ) కింద దాచి పెట్టింది. చిన్నారి కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఎక్కడ వెతికినా కనిపించలేదు.

దాంతో.. వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంటి చుట్టు పక్కన ఉన్న సీసీ కెమరాలన్నీ పరిశీలించారు. చిన్నారి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆనవాళ్లే కనిపించలేదు. దాంతో పోలీసులు ఇంట్లో గాలించారు. ఇదే క్రమంలో అనుమానాస్పదంగా సదరు మహిళ ప్రవర్తిస్తుండటంతో అదుపులోకి తీసుకుని విచారించారు. దాంతో ఆ మహిళ జరిగిందంతా చెప్పేసింది. దీంతో ఆమె ఫై హత్య కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

Read Also : Andhra Settlers Votes : కేటీఆర్ వల్ల ఏపీ సెటిలర్ల ఓట్లు బిఆర్ఎస్ కు పడకుండా అయ్యాయా..?