Site icon HashtagU Telugu

LTTE Chief Prabhakaran: ఎల్‌టీటీఈ చీఫ్ ప్రభాకరన్ బతికే ఉన్నారట!

Prabhakarn

Prabhakarn

ఎల్‌టీటీఈ చీఫ్ వెలుపిళ్లై ప్రభాకరన్  (LTTE Chief Prabhakaran) బతికే ఉన్నారంటూ సంచలన ప్రకటన ఒకటి ఆసక్తిరేపుతోంది. తమిళ్ నేషనలిస్ట్ లీడర్ పర నెడుమారన్ ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారుతోంది. ప్రభాకరన్  అనుమతితోనే ఈ విషయం వెల్లడిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. 2009లో శ్రీలంక సైన్యంతో జరిగిన యుద్ధంలో ప్రభాకరన్ (LTTE Chief Prabhakaran) చనిపోయారు. ఆయన మృతదేహాన్ని కూడా గుర్తించారు. కానీ..ఉన్నట్టుండి ఆయన బతికే ఉన్నారంటూ వార్తలు రావడం సంచలనమవుతోంది. ప్రభాకరన్ అనుమతితోనే ఈ విషయం వెల్లడిస్తున్నట్టు ప్రకటించారు.

త్వరలో ప్రజల ముందుకు

2009లో శ్రీలంక (Sri Lanka) సైన్యంతో జరిగిన యుద్ధంలో ప్రభాకరన్ చనిపోయారు. ఆయన మృతదేహాన్ని కూడా గుర్తించారు. కానీ..ఉన్నట్టుండి ఆయన (LTTE Chief Prabhakaran) బతికే ఉన్నారంటూ వార్తలు రావడం సంచలనమవుతోంది. అంతే కాదు. ఆయన ఇప్పటికీ తన కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారనీ చెప్పారు నెడుమారన్. 2009లోనే ఆయనను మట్టుబెట్టినట్టు శ్రీలంక అప్పట్లోనే స్పష్టం చేసింది. డెడ్‌బాడీ (Dead body) ఫోటోలనూ బయట పెట్టింది. ఇప్పుడు నెడుమారన్ “ప్రభాకరన్ బతికే ఉన్నారు” అని చెప్పడం అలజడి సృష్టిస్తోంది. అంతే కాదు. త్వరలోనే ఆయన ప్రజల ముందుకు వస్తారనీ చెప్పారు.

ఆయన చనిపోయారు.. మా దగ్గర ఆధారాలున్నాయి

LTTE చీఫ్ ప్రభాకరన్ బతికే ఉన్నారంటూ తమిళ నేషనలిస్ట్ లీడర్ నెడుమారన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనమవుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై శ్రీలంక సైన్య ప్రతినిధి బ్రిగేడియర్ రవి హెరాత్‌  స్పందించారు. ప్రభాకరన్ బతికున్నారన్న వార్తలపై స్పందించిన ఆయన ఆ వ్యాఖ్యల్ని కొట్టి పారేశారు. ఆయన చనిపోయాడు అనడానికి DNA రిపోర్ట్‌తో సహా అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు.

Also Read: Blind Girl Killed: తాడేపల్లికి కూతవేటు దూరంలో.. అంధ బాలికను చంపిన రౌడీ షీటర్