Site icon HashtagU Telugu

Uniform Civil Code : యూసీసీపై కేంద్రం కీలక ప్రకటన.. విధివిధానాల ప్రశ్నే తలెత్తదని వెల్లడి

Ucc Vs Communities

Ucc Vs Communities

Uniform Civil Code : యూనిఫామ్ ​ సివిల్​ కోడ్​(యూసీసీ) ప్రస్తుతం చర్చల దశలోనే  ఉన్నందున,  దానికి సంబంధించిన విధివిధానాల ప్రశ్నే తలెత్తదని కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి అర్జున్​ రామ్​ మేఘవాల్​ తెలిపారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజు  రాజ్యసభలో యూసీసీపై నాలుగు ప్రశ్నలు వచ్చాయి. యూసీసీపై(Uniform Civil Code)   చర్చలో లా కమిషన్​ జోక్యంపై పలువురు రాజ్యసభ సభ్యులు ప్రభుత్వ వివరణ కోరారు. ‘కుటుంబ చట్ట సంస్కరణ’పై 21వ లా కమిషన్ నాలుగేళ్ల క్రితమే సంప్రదింపులు జరిపినప్పటికీ ప్రభుత్వానికి నివేదికను సమర్పించలేదన్నారు. అందుకే 22వ లా కమిషన్​ యూసీసీ ఔచిత్యం, ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని మళ్లీ అభిప్రాయాలను సేకరిస్తోందని వివరించారు.

Also read : Blasts In Pakistan: పాకిస్థాన్ లో ఆత్మాహుతి దాడి.. పోలీసు మృతి, ఎనిమిది మందికి గాయాలు

కర్ణాటక మాజీ ప్రధాన న్యాయమూర్తి రితురాజ్ ​అవస్తీ నేతృత్వంలోని 22వ లా కమిషన్​ యూసీసీపై  ప్రజలు, వివిధ మత సంస్థల అభిప్రాయాన్ని జూన్ 14 నుంచి ఆహ్వానించింది. అనూహ్య స్పందనను చూసి ఈ నెల 14న ముగిసిన గడువును మరో రెండు వారాల పాటు పొడిగించింది. లింగం, కులం, మతం తదితర అంశాల్లో చట్టం ముందు అందరూ సమానమేనని, యూసీసీ ఆకృతిని దానికి అనుగుణంగానే రూపొందిస్తామని మంత్రి సూచనప్రాయంగా చెప్పారు.

Also read : Project K Glimpse : ప్రాజెక్ట్ K టైటిల్, గ్లింప్స్ వచ్చేసింది.. అదిరిపోయిన విజువల్స్.. హాలీవుడ్ ని మించి..