Site icon HashtagU Telugu

Cut Into 4 Pieces: దారుణం.. సాధువును హత్య చేసి 4 ముక్కలుగా నరికి

Son Killed Father

Crime Scene

ఓ సాధువును హత్య (Murder) చేసి నాలుగు ముక్కలుగా నరికిన ఘటన రాజస్థాన్‌లోని ధో‌పూర్‌లో చోటుచేసుకుంది. భీమ్‌ఘర్ గ్రామానికి చెందిన సాధువును దుండగులు హత్య (Murder) చేసి మృతదేహాన్ని నాలుగు ముక్కలుగా నరికి దగ్గరలోని నదిలో పడేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సాధువు శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఓ సాధువు హత్యకు గురయ్యాడు. అతని మృతదేహాన్ని నాలుగు ముక్కలుగా నరికి నది దగ్గర పడేశారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. మృతుడు 60 ఏళ్ల మహముద్దీన్ ఖాన్‌గా గుర్తించారు. ధోల్‌పూర్‌లోని భీమ్‌ఘర్ గ్రామానికి చెందిన అతను చాలా కాలం క్రితం మతం మారాడు. జిల్లాలోని చమర్ మాత ఆలయంలో పదేళ్లుగా పూజారిగా ఉన్నారు. అయితే బుధవారం ఖాన్ మృతదేహం నాలుగు ముక్కలుగా నరికి నదికి సమీపంలో పడి ఉంది. గమనించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు.

Also Read: Bikini Killer: 19 ఏళ్ల తర్వాత జైలు నుంచి బికినీ కిల్లర్ విడుదల.. కోర్టు ఆదేశాలు.. ఎవరు.. ఏమిటి?

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నాలుగు ముక్కలుగా నరికిన ఖాన్ శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కొంత మంది సాధువులతో అతనికి గొడవ జరిగినట్లు తెలిసిందని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఖాన్ హత్య జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆ సాధువులంతా పరారీలో ఉన్నారని, వారిపైనే అనుమానం ఉందని పోలీసు అధికారి తెలిపారు. ఖాన్ హత్యపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.