Site icon HashtagU Telugu

Gang Rape: బీహార్ లో దారుణం.. బాలిక కిడ్నాప్, గ్యాంగ్ రేప్

Gang Raped

Gang Raped

కోచింగ్ క్లాస్ నుంచి తిరిగి వస్తున్న బాలికను కిడ్నాప్ చేసి ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం (Gang Rape) చేశారు. ఈ దారుణ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బీహార్ రాజధానిలో నిరసనలు చెలరేగుతున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక మంగళవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో పాట్నాలోని కోచింగ్ సెంటర్ నుంచి ఇంటికి వస్తోంది.

అయితే ఈ సమయంలో పలువురు వ్యక్తులు బాలికను ఆటోలో కిడ్నాప్ చేశారు. అనంతరం బాలికను జల్లా ప్రాంతంలోని హనుమాన్‌ దేవాలయం సమీపంలోని ప్రదేశానికి తీసుకెళ్లినట్లు ‘ఐఏఎన్‌ఎస్‌’ నివేదించింది. అనంతరం బాలికను ఓ గదిలోకి తీసుకెళ్లి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. దీంతో బాలిక స్పృహతప్పి పడిపోయింది. అనంతరం మైనర్‌ను శని ఆలయం దగ్గర పడేసి వెళ్లిపోయారు.

Also Read: Dont Search in Google : గూగుల్‌లో ఇవి వెతికారా మీకు చిక్కులే..

అయితే కొంత సేపటికి బాలిక స్పృహలోకి వచ్చింది. అనంతరం ఇంటికి వెళ్లి జరిగిన జరిగింది తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రులు స్థానిక పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను గుర్తించారు. ఈ దారుణానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికుల నిరసన చేపట్టారు. పోలీసులు ఆటో డ్రైవర్ ను మాత్రమే అరెస్టు చేశారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు.