కర్ణాటక (Karnataka) లో ప్రవేశ పెట్టిన ఫ్రీ బస్సు (Free Bus Effect) కారణంగా నడిరోడ్డు ఫై ప్రయాణికులు జుట్లు పట్టుకొని కొట్టుకున్న (2 Women Fighting) ఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. కర్ణాటక లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ..అధికారంలోకి రాగానే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించింది. ఈ క్రమంలో సీటు విషయంలో ఇద్దరు ఆడవారు గొడవపడ్డారు. ఆ గొడవ కాస్త కొట్టుకునే స్థాయికి వెళ్ళింది. గొడవ ఎక్కువ కావడంతో డ్రైవర్ బస్సు అపి..కిందకు దించాడు. అక్కడికి ఆగకుండా ఆ ఇరువురు ఒకరికారు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. ఈ ఘటనను ప్రయాణికులు వారి సెల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన చాలామంది తెలంగాణ (Telangana) లో కూడా ఇలాంటి ఘటనలే జరుగుతాయని అంటున్నారు. ఎందుకంటే రీసెంట్ గా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం..తెలంగాణ లో కూడా ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించింది. ఈ ఫ్రీ ఎప్పుడైతే పెట్టారో..ప్రయాణికులు పెద్ద ఎత్తున బస్సు ప్రయాణం చేస్తున్నారు. ఆడవారు పోటీపడి..బస్సు ఎక్కుతుండడంతో వారిని ఏమి అనలేకపోతున్నామని , మగవారికి సీట్లు లేకుండా అవుతుందని..డబ్బులు పెట్టి టికెట్ తీసుకున్న మీము నిల్చుని ప్రయాణం చేయాల్సి వస్తుందని వారంతా వాపోతున్నారు.
కర్ణాటకలో ఫ్రీ బస్ ఎఫెక్ట్.. దారుణంగా కొట్టుకున్న ప్రయాణికులు pic.twitter.com/5bi1Gok6NZ
— Telugu Scribe (@TeluguScribe) December 25, 2023
Read Also : 3 Step Plan : ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం ముగించడానికి 3 దశల ప్లాన్