Jackals Terror : నక్కలు, తోడేళ్లు రెచ్చిపోతున్నాయి. ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లోని బహ్రయిచ్ జిల్లాలో తోడేళ్ల దాడిలో 8 మంది చనిపోయారు. 35 మందికి గాయాలయ్యాయి. బిహార్‌లోని ఓ అటవీ ప్రాంతంలో నక్కల దాడిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలను మరువకముందే మధ్యప్రదేశ్‌లోని అడవుల్లో నక్కలు చెలరేగాయి. సోమవారం సాయంత్రం సెహోర్ జిల్లా రెహ్తీ తహసీల్‌లోని సగోనియా పంచాయతీలో శ్యామ్ యాదవ్, నర్మదా ప్రసాద్‌లపై నక్కలు దాడికి పాల్పడ్డాయి. రోడ్డు పక్కన కూర్చున్న ఇద్దరు వ్యక్తులపై నక్కలు(Jackals Terror) దాడి చేశాయి.
Also Read :Sebi Chief Received Crores : మహీంద్రా గ్రూప్ నుంచి రూ.కోట్లు సంపాదించారు.. సెబీ చీఫ్‌పై కాంగ్రెస్ ఆరోపణలు
ఈ ఘటన అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. దీంతో ఆ ఇద్దరు రాళ్లు తీసుకొని నక్కలపైకి రాళ్లు విసిరి వాటిని తరిమేందుకు యత్నించారు. అయినా నక్కలు అక్కడి నుంచి వెళ్లలేదు. నక్క ఒకటి పరుగెత్తుతూ వచ్చి ఓ వ్యక్తిపైకి దూకింది. అయితే అతడు సాహసోపేతంగా వ్యవహరించి ఆ నక్కను పట్టుకొని బలంగా విసిరికొట్టాడు. దీంతో ఆ నక్క దాదాపు 15 అడుగుల దూరంలో పడింది. ఇదంతా సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. ఈ ఘటనలో గాయపడిన శ్యామ్ యాదవ్, నర్మదా ప్రసాద్‌లకు నర్మదాపురం జిల్లా ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది.
Also Read :5000 Cyber Commandos: సైబర్ క్రైమ్స్ కట్టడికి 5వేల సైబర్ కమాండోలు : హోంమంత్రి అమిత్‌షా
సగోనియా గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా బయటకు వెళ్లొద్దని స్థానిక అధికారులు సూచించారు. ఒకవేళ ఏదైనా పనిమీద బయటకు వచ్చినా గుంపులుగా ప్రయాణించాలని గ్రామస్తులను కోరారు. ఈ దాడికి పాల్పడిన నక్కలను పట్టుకునే వరకు అలర్ట్‌గా ఉండాలన్నారు. ఈ దాడి ఘటనపై అటవీ శాఖకు సమాచారం అందించామని చెప్పారు. స్థానిక ఫారెస్ట్ రేంజర్ హరీష్ మహేశ్వరి క్షతగాత్రులను పరామర్శించి పరిహారం అందజేశారు. కాగా, సోమవారం రోజు మధ్యప్రదేశ్‌లోని సల్కాన్‌పూర్‌లో ఉన్న మారుమూల అటవీ ప్రాంతంలో ఐదుగురు వ్యక్తులపై నక్క దాడి చేసింది. ఆ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి.