Site icon HashtagU Telugu

PM Modi : కాంగ్రెస్‌ నుంచి “సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌” ఆశించడం తప్పిదమే: ప్రధాని

It is wrong to expect sabka saath sabka vikas from Congress: PM

It is wrong to expect sabka saath sabka vikas from Congress: PM

PM Modi : రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోడీ రాజ్యసభ లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రపతి ప్రసంగం స్ఫూర్తిదాయకంగా, ప్రభావవంతంగా ఉందని కొనియాడారు. అది మనందరికీ ముందుకు సాగే మార్గాన్ని చూపించిందని పేర్కొన్నారు. “సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌” అనే భావనను కాంగ్రెస్‌ నుంచి ఆశించడం తప్పిదమే అవుతుందని ప్రధాని మోడీ విమర్శించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో రాజ్యాంగ విలువలను తుడిచిపెడుతోందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. వాటికి ప్రధాని కౌంటర్ ఇచ్చారు.

Read Also: Erravalli : ఎర్రవల్లి భూములకు భారీ డిమాండ్..కారణం అదే..!!

ఫ్యామిలీ ఫస్ట్ అన్నది కాంగ్రెస్‌ సిద్ధాంతం. సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ అంటే కాంగ్రెస్‌కు అర్థం కావట్లేదు. కాంగ్రెస్ మోడల్ అంటే అబద్ధాలు, మోసం, బుజ్జగింపు, పక్షపాతం కలయిక. కానీ నేషన్‌ ఫస్ట్‌ అన్నది మా విధానం. అందుకే ప్రజలు అభివృద్ధి మోడల్​కు మద్దతు ఇచ్చారు. ఎన్​డీఏ ప్రభుత్వానికి అందరనీ సంతృప్తి పరిచే మోడల్. ప్రజల సంక్షేమం కోసం వనరులను గరిష్ఠంగా ఉపయోగించుకోవడమే మా ప్రయత్నం అని మోడీ అన్నారు. ఈ క్రమంలోనే ప్రజలు మమ్మల్ని మూడు సార్లు విశ్వసించారని ప్రధాని మోడీ తెలిపారు. సమాజంలో కులం అనే విషాన్ని నింపే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధాని హెచ్చరించారు.

అంబేడ్కర్‌కు భారతరత్న ఇచ్చేందుకు కాంగ్రెస్‌కు మనసు అంగీకరించలేదు. అంబేడ్కర్‌ను ఓడించేందుకు కాంగ్రెస్‌ అనేక కుట్రలు చేసింది. కానీ ఇప్పుడు వారు జై భీమ్ అని అనాల్సి వస్తోంది. మా ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక, పారిశ్రామికీకరణపై దృష్టి పెట్టింది. అంబేడ్కర్​ కలలను పీఎం ముద్రా యోజన వంటి పథకాల ద్వారా మేము సాకారం చేస్తున్నాము. పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం మా ప్రాధాన్యం. అని ప్రధాని పేర్కొన్నారు. ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారి కోసం 10 శాతం రిజర్వేషన్ తెచ్చామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఎస్​టీ, ఎస్​టీ, బీసీలకు నష్టం లేకుండా 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ ఇచ్చాం. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను ఓబీసీలు కూడా స్వాగతించారు. దివ్యాంగుల కోసం ఎన్నో ఉపాధి కల్పన కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ట్రాన్స్‌జెండర్లకు రాజకీయాల్లో అవకాశాలు కల్పిస్తున్నాం. చరిత్రాత్మకమైన నారీశక్తి వందన్‌ చట్టం కూడా చేశాం. కొత్త పార్లమెంటు భవనంలో తొలి నిర్ణయం నారీ శక్తి గురించే అని ప్రధాని అన్నారు.

Read Also: Gig Workers : గుడ్ న్యూస్.. గిగ్ వర్కర్లకు పెన్షన్ స్కీం.. ప్రయోజనం ఇలా..