Site icon HashtagU Telugu

NSA Ajit Doval : రష్యా- ఉక్రెయిన్ శాంతి చర్చలు.. మాస్కోకు భారత ఎన్ఎస్ఏ అజిత్ దోవల్!

Nsa Ajit Doval Russia Ukraine Peace Talks

NSA Ajit Doval : రష్యా-ఉక్రెయిన్ మధ్య జరగనున్న శాంతి చర్చలకు భారత్ కూడా మధ్యవర్తిగా వ్యవహరించబోతోంది. భారత్ తరఫున రష్యా, ఉక్రెయిన్‌లతో చర్చలు జరిపేందుకు భారత జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్ఏ) అజిత్ దోవల్ ఈవారంలోనే మాస్కోకు బయలుదేరి వెళ్తారని తెలుస్తోంది. ప్రధాని మోడీ ఉక్రెయిన్ పర్యటనను ముగించుకొని భారత్‌కు చేరుకోగానే.. ఆగస్టు 27న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఫోన్ కాల్ చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడితో తన భేటీలో ప్రస్తావనకు వచ్చిన అంశాల గురించి ఈసందర్భంగా పుతిన్‌కు మోడీ వివరించారు. ఆ ఫోన్ కాల్ చేసిన రోజే భారత్ తరఫున శాంతి చర్చల్లో పాల్గొనేందుకు ఎన్‌ఎస్ఏ అజిత్ దోవల్‌ను(NSA Ajit Doval) పంపాలని ప్రధాని మోడీ నిర్ణయించినట్లు తెలిసింది.  అయితే అజిత్ దోవల్ నిర్దిష్టంగా ఎప్పుడు రష్యాకు బయలుదేరి వెళ్తారనేది తెలియరాలేదు.

Also Read :Hydra Demolitions : తెల్లవారుజామునే రంగంలోకి హైడ్రా.. కోట్లు విలువైన విల్లాల కూల్చివేతలు

ఉక్రెయిన్ వివాదంపై రష్యాతో సంప్రదింపులు జరుపుతున్న మూడు దేశాల్లో భారత్ పేరును ఇటీవలే అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. బ్రెజిల్, భారత్, చైనాలు ఈ శాంతిచర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తే తమకు అభ్యంతరం లేదని ఆయన చెప్పారు. రష్యాతో పాటు ఈ మూడు దేశాలు బ్రిక్స్ కూటమిలో భాగంగా ఉన్నాయి. దీన్నిబట్టి నాటో కూటమికి ధీటుగా బ్రిక్స్ కూటమి ఎదుగుతున్న తీరుకు ఈ పరిణామాలు నిదర్శనం.  త్వరలోనే సౌదీ అరేబియా, టర్కీ కూడా బ్రిక్స్ కూటమిలో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read :Islamic Countries Alliance : ఇస్లామిక్ దేశాల కూటమితో ఇజ్రాయెల్‌ ఉగ్రవాదాన్ని ఆపుదాం: ఎర్దోగన్

ఒకవేళ అదే జరిగితే.. అగ్రరాజ్యం అమెరికాకు, దానికి వంతపాడే ఐరోపా దేశాలకు పెద్ద షాక్ తగిలినట్లు అవుతుంది. బ్రిక్స్ కూటమి బలోపేతంతో భారత్, చైనాల మధ్య సఖ్యత పెరిగే అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద గత రెండున్నర ఏళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి శాంతితో ఒక పరిష్కారాన్ని సాధించే గొప్ప అవకాశం భారత్‌కు దక్కింది. ఐక్యరాజ్యసమితి కూడా చేయలేని పనిని.. భారత్, చైనా, బ్రెజిల్ దేశాలు చేసి చూపించడం ద్వారా బ్రిక్స్ కూటమి సత్తా ప్రపంచానికి తెలుస్తుంది.

Also Read :Munneru Floods Threat: మున్నేరుకు మరోసారి వరద గండం.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ