Site icon HashtagU Telugu

Indian Prisoners : ఏ దేశంలో ఎంతమంది భారతీయ ఖైదీలున్నారు.. తెలుసా ?

Indian Prisoners In Foreign Jails Indian Nationals Saudi Arabia

Indian Prisoners : ప్రపంచంలోని వివిధ దేశాల జైళ్లలో ఎంతోమంది భారతీయులు మగ్గుతున్నారు.  ఈ లిస్టులో చైనా నుంచి నేపాల్ దాకా ఎన్నో దేశాలు ఉన్నాయి. మన భారతదేశం పొరుగున ఉన్న నేపాల్‌లోని జైళ్లలో దాదాపు  1,317 మంది భారతీయులు జైలు శిక్షను అనుభవిస్తున్నారు. అయితే అత్యధిక భారతీయ ఖైదీలు ఉన్నది మాత్రం సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ జైళ్లలోనే. ఈ రెండు దేశాల జైళ్లలో 2వేల మందికిపైగా భారతీయ ఖైదీలు ఉన్నారు. పాకిస్తాన్‌లోని జైళ్లలో 266 మంది, శ్రీలంకలో 98 మంది, సింగపూర్‌లో 92 మంది, భూటాన్‌లో 69 మంది,  థాయ్‌లాండ్‌లో 37 మంది, మాల్దీవుల్లో 10 మంది, మారిషస్‌లో 10 మంది, ఆఫ్ఘనిస్తాన్‌లో 8 మంది, బంగ్లాదేశ్‌లో నలుగురు, ఇజ్రాయెల్‌లో నలుగురు, మయన్మార్‌లో 27 మంది భారతీయ ఖైదీలు(Indian Prisoners) ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 86 దేశాల్లోని జైళ్లలో 10,152 మంది భారతీయ ఖైదీలు ఉన్నారు. ఈమేరకు వివరాలతో ఒక నివేదికను భారత విదేశీ వ్యవహారాల శాఖ విడుదల చేసింది.

ఏ దేశంలో ఎంతమంది ? 

  • మలేషియాలోని జైళ్లలో 338 మంది, చైనాలోని జైళ్లలో 173  మంది భారతీయ ఖైదీలు ఉన్నారు.
  • ఖతర్‌లోని జైళ్లలో 611 మంది, కువైట్‌లోని జైళ్లలో 387 మంది, బహ్రయిన్‌లోని జైళ్లలో 181 మంది, ఒమన్‌లోని జైళ్లలో 148 మంది, జోర్డాన్‌లోని జైళ్లలో 28 మంది భారతీయ ఖైదీలు ఉన్నారు.
  • బ్రిటన్‌లోని జైళ్లలో 288 మంది, అమెరికాలోని జైళ్లలో 169 మంది, ఫ్రాన్స్‌లోని జైళ్లలో 45 మంది, ఆస్ట్రేలియాలోని జైళ్లలో 27 మంది, రష్యాలోని జైళ్లలో 27 మంది, జర్మనీలోని జైళ్లలో 25 మంది, కెనడాలోని జైళ్లలో 23 మంది భారతీయ ఖైదీలు ఉన్నారు.
  •  ఇండోనేషియాలోని జైళ్లలో 21 మంది, ఇరాన్‌లో 18 మంది, దక్షిణాఫ్రికాలో 8 మంది, జపాన్‌లో 6 మంది భారతీయ ఖైదీలు ఉన్నారు.

Also Read :Maoists : కేంద్రంతో శాంతిచర్చలకు సిద్ధమని మావోయిస్టుల ప్రకటన

ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పెనాల్టీ పర్సన్స్.. ఏమిటిది ? 

9 దేశాలను ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పెనాల్టీ పర్సన్స్ అగ్రిమెంట్‌లో చేర్చారు. అంటే ఆ 9 దేశాలతో భారత విదేశాంగ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం.. ఆయా దేశాల్లో నేరం రుజువైన భారతీయులను శిక్ష అనుభవించడానికి,  స్వదేశానికి పంపొచ్చు. ఈ ఒప్పందం తర్వాత గత మూడేళ్లలో 8 మంది ఖైదీలను దేశానికి రప్పించి భారత జైళ్లలో ఉంచారు. వీరిలో ఇరాన్ నుంచి ముగ్గురు, బ్రిటన్ నుంచి ముగ్గురు, కంబోడియా నుంచి ఇద్దరు, రష్యా నుంచి ఇద్దరు ఉన్నారు. విదేశాల్లోని జైళ్ల నుంచి భారతీయులను విడుదల చేయడం లేదా స్వదేశానికి రప్పించడంపై రెగ్యులర్ ఇండియన్ మిషన్లు పనిచేస్తున్నాయని భారత విదేశాంగ శాఖ తెలిపింది.