Indian Astronauts : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘ఇస్రో’, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ కలిసి 2026 సంవత్సరం చివరికల్లా గగన్ యాన్ మిషన్‌ను చేపట్టనున్నాయి. ప్రస్తుతం ఈ రెండు సంస్థల వ్యోమగాములకు ట్రైనింగ్ జరుగుతోంది. ఇటీవలే తొలిదశ శిక్షణ పూర్తయింది. దానికి సంబంధించిన కొన్ని వివరాలు బయటికి వచ్చాయి. అవేంటో తెలుసుకుందాం..
Also Read :Space Junk : ‘స్పేస్’ జామ్.. భూకక్ష్యలో భారీగా శాటిలైట్లు, అంతరిక్ష వ్యర్థాలు
నాసా, ఇస్రో సంయుక్త గగన్ యాన్ మిషన్‌లో భారత్ తరఫున సుభాన్షు శుక్లా, ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ పాల్గొనబోతున్నారు. వారు స్పేస్ క్రాఫ్ట్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) వెళ్లబోతున్నారు. అక్కడే కొన్ని రోజుల పాటు ఉండి, తిరిగొస్తారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్‌లో అగ్జియోమ్ స్పేస్ కంపెనీకి చెందిన ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ సెంటర్ ఉంది. అందులోనే నాసా, ఇస్రో వ్యోమగాములకు(Indian Astronauts) ప్రస్తుతం ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇటీవలే తొలి విడత ట్రైనింగ్‌లో భాగంగా ఐఎస్ఎస్‌లో లభించే వివిధ రకాల ఆహారాలు, పానీయాలను వ్యోమగాములకు పరిచయం చేశారు. వాటిని తాగుతూ, తింటూ స్పేస్‌లో ఎలా ఉండాలనే దానిపై మోటివేషన్ చేశారు. ఈ ట్రైనింగ్ క్రమంలో స్పేస్ సూట్‌లో ఇస్రో వ్యోమగాములు దిగిన పలు ఫొటోలు బయటికి వచ్చాయి.
Also Read :Agniveer Recruitment : డిసెంబరు 8 నుంచి హైదరాబాద్‌లో అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ
అంతరిక్ష కేంద్రంలో ఉన్న టైంలో ప్యాకేజ్డ్ ఫుడ్‌ను ఎలా రీహైడ్రేట్ చేసుకోవాలి ? మైక్రో గ్రావిటీ వాతావరణం నడుమ ఫుడ్‌ను ఎలా తినాలి ? వంటలు ఎలా వండుకోవాలి ? వంటి అంశాలపై వారికి ట్రైనింగ్ ఇచ్చారు. ఎలా నిద్రపోవాలి ? ఎంతసేపు నిద్రపోవాలి ? పరిశుభ్రత పాటించడం ఎలా ? ఎమర్జెన్సీ పరిస్థితి వస్తే ఏం చేయాలి ? అనే అంశాలపైనా ఆస్ట్రోనాట్లకు అవగాహన కల్పించారు.ఇది మన దేశం చేపట్టిన మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర. ఈ మిషన్ సక్సెస్‌పై భారత్ గంపెడాశలు పెట్టుకుంది.