India Vs Pak : కశ్మీరులోని పహల్గాంలో జరిగిన భీకర ఉగ్రదాడిని భారత్ సీరియస్‌గా పరిగణిస్తోంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కశ్మీరులోని అడవుల్లో, పాక్ ఆక్రమిత కశ్మీరు (పీఓకే) ప్రాంతంలో తలదాచుకుంటున్నట్లు భారత్ గుర్తించింది. మంగళవారం రోజు ఉగ్రదాడికి పాల్పడిన టెర్రరిస్టులు కూడా అడవుల్లోకే పారిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఉగ్రవాదుల్లో కొందరు స్థానిక హోటళ్లు, లాడ్జీలలో తలదాచుకొని ఉండొచ్చని అనుకుంటున్నారు. ప్రత్యక్ష సాక్షులైతే.. ఉగ్రవాదులు అడవుల్లోకి వెళ్తుండగా తాము చూశామని చెప్పారు. వారిని దర్యాప్తు విభాగాలు ప్రశ్నించాయి.
Also Read :Mahesh Babu: యాడ్స్‌తో మహేశ్‌బాబు సంపాదన ఎంతో తెలుసా ?
అడవులను జల్లెడ పడుతూ..
ఈనేపథ్యంలో భారత భద్రతా బలగాలు(India Vs Pak) పహల్గాం పరిసర ప్రాంతాల్లోని అడవులను జల్లెడ పడుతున్నాయి. ఇవాళ సాయంత్రం కేంద్ర క్యాబినెట్ కీలక సమావేశం జరగబోతోంది. అది ముగిసిన తర్వాత కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈరోజు మధ్యాహ్నం భారత త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమావేశమయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా స్వయంగా కశ్మీరులో ఉగ్రదాడి జరిగిన ప్రాంతంలో పర్యటిస్తున్నారు. కశ్మీర్‌లో ప్రస్తుతమున్న పరిస్థితుల గురించి ప్రధాని మోడీకి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వివరించారు.
Also Read :NTR Statue: ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’లా అమరావతిలో ఎన్టీఆర్ భారీ విగ్రహం
భారత్‌కు హెల్ప్ చేస్తాం : ఇజ్రాయెల్
భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్.. దౌత్యపరంగా ఈ అంశంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ప్రధాని మోడీకి కీలక సూచనలు చేసినట్లు తెలిసింది. దౌత్య మార్గాల్లో పాకిస్తాన్‌కు ముందస్తు సమాచారం అందించి.. పాక్ ఆక్రమిత కశ్మీరు(పీఓకే)లోని ఉగ్రవాద స్థావరాలపై భారత ఆర్మీ దాడులు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తద్వారా ఇరుదేశాల మధ్య యుద్ధం లాంటి దీర్ఘకాలిక విపత్కర పరిస్థితులు తలెత్తకుండా గట్టెక్కొచ్చని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ ఆదేశం వచ్చినా అమలుపర్చేందుకు సిద్ధమని భారత సిద్ధమంటున్న త్రివిధ దళాధిపతులు అంటున్నారు. దీంతో భారత్ -పాక్ బార్డర్‌లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రత్యేకించిన పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీరు ప్రాంతంలో ఏం జరగబోతోంది ? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కాగా, భారత మిత్రదేశం ఇజ్రాయెల్ కీలక ప్రకటన చేసింది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేస్తే తాము సహకరిస్తామని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ ప్రకటించింది.