Site icon HashtagU Telugu

Futuristic Robotic Mules : ఆర్మీ రోబోలు ఇవిగో.. ఆర్మీ డే పరేడ్‌తో బరిలోకి.. ఇవేం చేస్తాయంటే ?

Indian Army Futuristic Robotic Mules Pune Army Day 2025

Futuristic Robotic Mules : రోబోలు మన సైన్యంలోకి ఎంట్రీ ఇచ్చాయి. నాలుగు పాదాలతో కూడిన Q-UGV రోబోలను మహారాష్ట్రలోని పూణేలో నిర్వహించిన భారత ఆర్మీ డే పరేడ్‌లో ప్రదర్శించారు.  బాంబే ఇంజినీరింగ్ గ్రూప్ (BEG)నకు చెందిన పరేడ్ మైదానం వేదికగా ఈ పరేడ్ జరిగింది. ఇప్పటివరకు AeroArc Pvt Ltd కంపెనీ నుంచి భారత సైన్యం దాదాపు 100కుపైగా రోబోలను కొనుగోలు చేసింది. వీటి పేరు.. ‘ఆర్క్‌వీ మ్యూల్’.  ఈ రోబోలను సైనికులు రిమోట్‌‌తో ఆపరేట్ చేయొచ్చు. స్వయం ప్రతిపత్తితోనూ అవి పనిచేయగలవు. ఇంతకీ ఈ రోబోలు ఎలా పనిచేస్తాయి ? వీటి ప్రత్యేకతలు ఏమిటి ? అనేది ఈ కథనంలో చూద్దాం..

Also Read :Three Warships Commissioned : ‘‘వికాసం కావాలి.. విస్తరణ కాదు’’.. మూడు యుద్ధ నౌకలను జాతికి అంకితమిచ్చిన మోడీ

ఎందుకీ పరేడ్ ?

భారత సైన్యానికి తొలి కమాండర్ ఇన్ చీఫ్‌గా ఫీల్డ్ మార్షల్ కె.ఎం.కరియప్పను 1949 సంవత్సరం జనవరి 15న  నియమించారు. బ్రిటీషర్ల చివరి కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఇండియా ఎఫ్ఆర్ఆర్ బుచర్ నుంచి కరియప్ప బాధ్యతలను స్వీకరించారు. ఆ చారిత్రక రోజును గుర్తు చేసుకుంటూ ఏటా జనవరి 15న ఆర్మీ డే పరేడ్‌ను నిర్వహిస్తుంటారు.

Also Read :Skill Development Case : సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట

ఈ రోబోలు ఏం చేస్తాయి ?

రోబోలోని విశేషాలు..