INDIA – Social Media : సోషల్ మీడియా.. ప్రజలపై గణనీయ ప్రభావం చూపించగల మహాస్త్రం.. ప్రజలకు ఒక ఒపీనియన్ ను క్రియేట్ చేయడంలో అది అత్యంత పవర్ ఫుల్ టూల్.. ఇప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి దృష్టి సోషల్ మీడియాపై పడింది. బీజేపీ చాలా స్ట్రాంగ్ గా ఉన్న సోషల్ మీడియాపై పట్టు అత్యవసరమని ‘ఇండియా’ కూటమి నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈక్రమంలో ఆగస్టు 31, సెప్టెంబరు 1 తేదీల్లో మహారాష్ట్రలోని ముంబై వేదికగా జరగబోయే ‘ఇండియా’ సమావేశంలో సోషల్ మీడియా కార్యకలాపాల కోసం ప్రత్యేక ప్యానల్ ను ప్రకటించనున్నారని సమాచారం. కూటమిలోని పార్టీలు వాటి కంటెంట్ ను పరస్పరం సోషల్ మీడియాలో షేర్ చేసుకునేలా ఏర్పాట్లు చేయనున్నారని అంటున్నారు. ‘ఇండియా’ కూటమి కోసం ఉమ్మడి సోషల్ మీడియా, డిజిటల్ మీడియా వేదికను ఏర్పాటు చేయడంపైనా ఫోకస్ పెట్టనున్నారని సంబంధిత వర్గాలు మీడియాకు తెలిపాయి.దీనిపై ఏర్పాటు చేయనున్న ప్యానల్ లోని సభ్యులు అందించే సలహాల ఆధారంగా సోషల్ మీడియా ప్రచారానికి వ్యూహ రచన చేయనున్నారు. ఇండియా కూటమి తరఫున బహిరంగ సభలు, ర్యాలీలపై ప్లానింగ్ కు ఒక ప్యానల్, ప్రచార వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఒక ప్యానల్, ఇండియా కూటమికి సాంకేతిక, సామగ్రిపరమైన సహకారాన్ని అందించేందుకు ఒక ప్యానల్ ను కూడా ప్రకటించనున్నారని తెలిసింది. ఈ కమిటీల్లో అన్ని పార్టీలకూ చోటు దక్కేలా సమతుల్యత పాటించనున్నారు.
Also read : Garlic Side Effects: వెల్లుల్లి అధికంగా వాడుతున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు..!
పేపర్ బ్యాలెట్ తో ఎన్నికల నిర్వహణకు డిమాండ్ !
ఇప్పటికే ఇండియా కూటమి పేరు దేశమంతటా మార్మోగుతోంది. ఇక త్వరలోనే ఆగస్టు 31న ఇండియా కూటమి లోగోను కూడా రిలీజ్ చేయనున్నారని మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ చవాన్ వెల్లడించారు. ఎన్నికల పోలింగ్ కోసం ఈవీఎంల వినియోగంపై విధాన ప్రకటన చేయడంతో పాటు పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ ను ఈ మీటింగ్ ద్వారా వినిపించేందుకు ఇండియా కూటమి సన్నాహాలు చేస్తోంది. జూన్ 23న పాట్నాలో జరిగిన ఇండియా కూటమి తొలి మీటింగ్ లో 15 పార్టీలు హాజరయ్యాయి. జూలై 17, 18 తేదీల్లో బెంగళూరులో జరిగిన రెండో సమావేశంలో 26 పార్టీలు పాల్గొన్నాయి. ఇప్పుడు ఆగస్టు 31, సెప్టెంబరు 1 తేదీల్లో ముంబైలో జరగనున్న మీటింగ్ కు అటెండ్ అయ్యే ప్రతిపక్ష పార్టీల సంఖ్య ఇంకా పెరుగుతుందని ఇండియా కూటమి కీలక సభ్యుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెలిపారు.
Also read : Food for Childrens : పిల్లలలో ఇమ్యూనిటీ పెంచే ఆహారపదార్థాలు ఇవే..
11 మంది సభ్యుల కోఆర్డినేషన్ కమిటీపై క్లారిటీ..
ఇండియా కూటమిలోని పార్టీలను సమన్వయం చేసేందుకు 11 మంది సభ్యుల కోఆర్డినేషన్ కమిటీని (INDIA – Social Media) బెంగళూరు మీటింగ్ లోనే ప్రకటించింది. ముంబైలో జరగబోయే మీటింగ్ లో ఆ కమిటీలో ఉండే సభ్యులను ప్రకటించనున్నారు. రాష్ట్రాల స్థాయిలో అక్కడి రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా సీట్ల సర్దుబాటు ఎలా జరగాలనే అంశంపైనా ఈ సమావేశంలో ప్రధాన చర్చ జరగనుంది. ముంబై సమావేశం చివర్లో ఉమ్మడి ముసాయిదా ప్రకటనను విడుదల చేయనున్నారు. తదుపరిగా ఇండియా కూటమి సమావేశాలు కోల్‌కతా, చెన్నైలలో జరగనున్నాయని కూటమి వర్గాలు చెప్పాయి.