Operation Sindoor : భారత-పాక్ మధ్య యుద్ధాలు అధికారికంగా ముగిసినా, పాకిస్థాన్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదం మాత్రం ఆగలేదని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ స్పష్టంచేశారు. శుక్రవారం నాడు ఆయన ‘ఆపరేషన్ సిందూర్.. ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ డీప్ స్ట్రైక్స్ ఇన్‌సైడ్ పాకిస్థాన్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువరాజ్ తండ్రి
“అందరూ భావించినట్లు యుద్ధం మూడురోజులకే ముగిసిందని అనుకోవడం సరైనది కాదు. మే 10తో ఆపరేషన్‌లు అధికారికంగా ముగిసినా, దాని తర్వాత కూడా పాకిస్థాన్ నుంచి మద్దతు పొందుతున్న ఉగ్రవాదుల చొరబాట్లు ఆగలేదు. ఇప్పటికీ వారు సరిహద్దుల్లో విఘాతం సృష్టించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు” అని ఆర్మీ చీఫ్ ద్వివేదీ స్పష్టం చేశారు. భారత సైన్యం చేసిన లోతైన ఆపరేషన్లపై వెలుగుచూపే ‘ఆపరేషన్ సిందూర్’ పుస్తకాన్ని విడుదల చేసిన ద్వివేదీ, యుద్ధరంగంలో జరిగిన వాస్తవ సంఘటనలను జాగ్రత్తగా విశ్లేషించుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. పుస్తకంలో ఉగ్రవాదంపై భారత సైన్యం చేసిన కౌంటర్ స్ట్రైక్స్, పాక్ భూభాగం లోపల చేసిన ఆపరేషన్ల వివరణలు ఉన్నాయని ఆయన వివరించారు.
“సరిహద్దుల్లో ఉగ్రవాద ముప్పు ఇప్పటికీ కొనసాగుతోంది. పాకిస్థాన్ మద్దతు ఉన్న మిలిటెంట్లు నిరంతరం చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిని ఎదుర్కోవడానికి భారత సైన్యం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది” అని ద్వివేదీ తెలిపారు. ఈ వ్యాఖ్యలతో మరోసారి భారత్–పాక్ సంబంధాల్లో ఉగ్రవాదమే పెద్ద సమస్యగా ఉందని స్పష్టమైంది. జనరల్ ఉపేంద్ర ద్వివేదీ వ్యాఖ్యలతో దేశ భద్రతా వ్యవస్థ ఎంత అప్రమత్తంగా ఉందో బయటపడింది. యుద్ధం కేవలం బాంబులు, తుపాకులకే పరిమితం కాదని, ఉగ్రవాద రూపంలో ఇంకా కొనసాగుతూనే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. సరిహద్దుల్లో ఎప్పటికప్పుడు జరిగే చొరబాట్లకు ఎదురుగా భారత సైన్యం కఠినంగా నిలుస్తుందని ద్వివేదీ స్పష్టం చేశారు.
YS Jagan: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర విమర్శలు