Cool News 2025 : భారత వాతావరణ విభాగం (ఐఎండీ) కూల్ న్యూస్ వినిపించింది. ఈసారి వర్షాకాలం సీజన్‌లోని నాలుగు నెలల పాటు సాధారణం కంటే ఎక్కువ వర్షాలే కురుస్తాయని వెల్లడించింది. మనదేశంలో దీర్ఘకాలిక వర్షపాత సగటు 87 సెంటీమీటర్లుగా ఉందని, ఇందులో దాదాపు 105 శాతం దాకా ఈసారి సగటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈసారి వర్షాకాలంలో భారత్‌లో ఎల్ నినో తరహా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశాలే లేవని తెలిపింది. ఈవివరాలను ఐఎండీ చీఫ్ మృత్యుంజయ్ మోహపాత్ర మీడియాకు వెల్లడించారు. రుతుపవనాల గమన స్థితిగతులను(Cool News 2025) బట్టి జూన్ నుంచి సెప్టెంబరు వరకు వివిధ చోట్ల వివిధ స్థాయుల్లో వర్షాలు కురుస్తాయన్నారు.
Also Read :CM Revanth : మంత్రి పదవుల అంశంలో నోరుపారేసుకుంటే.. ఊరుకోం : సీఎం రేవంత్
వాళ్లకు పెద్ద శుభవార్తే..
వర్షాలు తగినంతగా కురిస్తే మనదేశంలోని రిజర్వాయర్లు నిండుతాయి. వాటి నుంచి ప్రజలకు సరిపడా తాగునీళ్లు సప్లై అవుతాయి. విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లకు అవసరమైనన్ని జలాలు అందుతాయి. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం కురవడం అనేది ఓ వైపు సామాన్య ప్రజలకు, మరోవైపు రైతులకు పెద్ద శుభవార్త. అయితే గత కొన్నేళ్లుగా మన దేశంలో అతి తక్కువ రోజుల్లో అతిభారీ వర్షాలు కురిసే ఘటనలు పెరుగుతున్నాయి. ఈ పరిణామం ఆందోళన కలిగిస్తోంది. ఫలితంగా పలుచోట్ల వరద బీభత్సం అతలాకుతలం చేస్తోంది. వాతావరణ మార్పుల వల్లే ఈ తరహా వైపరీత్యాలు చోటుచేసుకుంటున్నాయి.
Also Read :YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. సునీత వినతికి ‘సుప్రీం’ అంగీకారం
వడగాలులతో ఉత్తరాదిలో వణుకు
ప్రస్తుతం మన దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో వడగాలుల తీవ్రత పెరిగింది. జూన్ వరకు అవి కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది.వీటి కారణంగా విద్యుత్ గ్రిడ్‌ల పనితీరుకు ఆటంకం కలగొచ్చు. నీటి కొరత సమస్య ఏర్పడే ముప్పు ఉంది. వడగాలుల వల్ల ఏటా ఎంతోమంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. బాధిత కుటుంబాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కొంతమేర పరిహారాన్ని అందిస్తున్నా.. చనిపోయిన వారి లోటును ఆ పరిహారం డబ్బులు పూడ్చలేవు కదా.