Site icon HashtagU Telugu

Student Suicide: వాట్సాప్‌లో స్టేటస్‌ పెట్టి.. ఐఐటీ మద్రాస్‌లో పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య

Suicide Hanging 19

Suicide Hanging 19

ఐఐటీ మద్రాస్‌కు చెందిన పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య (Student Suicide) చేసుకున్నాడు. విద్యార్థి 32 ఏళ్ల రీసెర్చ్ స్కాలర్ సచిన్ కుమార్ జైన్‌గా గుర్తించారు. శుక్రవారం.. ఆత్మహత్య చేసుకునే ముందు వాట్సాప్‌లో స్టేటస్‌ పెట్టాడు. అందులో ‘‘ఇది సరిపోదు.. నన్ను క్షమించండి’ అని రాశాడు. జైన్ పశ్చిమ బెంగాల్ నివాసి అని, ఆత్మహత్యకు ముందు కూడా ఐఐటి మద్రాస్‌లోని గిండి క్యాంపస్‌లోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో రెగ్యులర్ క్లాస్‌లకు హాజరయ్యాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఎవరికీ చెప్పకుండా తన గదికి తిరిగి వచ్చాడు.

గంట తర్వాత సచిన్ కనిపించకపోవడం, అతను పెట్టిన స్టేటస్ స్నేహితులు చూడటంతో సచిన్ ని చేరుకునేందుకు స్నేహితులు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. అతని స్నేహితులు సచిన్ గదికి వెళ్లి చూడగా అక్కడ డైనింగ్ హాల్‌లో ఉరివేసుకుని కనిపించాడు. స్నేహితులు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. ఆసుపత్రిలోని అత్యవసర బృందం అతను మరణించినట్లు ప్రకటించింది.

Also Read: Heart Attack: తెలంగాణలో విషాదం.. గుండెపోటుతో ఆరో తరగతి బాలిక మృతి

సమాచారం అందుకున్న వెలచ్చేరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ విషయంపై పోలీసులు విచారణ ప్రారంభించారు. విద్యార్థి రాసిన స్టేటస్‌ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ వాట్సాప్ స్టేటస్‌పై అతని స్నేహితులను కూడా ప్రశ్నిస్తున్నారు. అంతకుముందు మార్చి 26న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కోచింగ్ టీచర్ వల్ల మనస్తాపానికి గురైన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అద్దె గదిలో ఉంటున్న ఆమె గదిలోనే ఉరి వేసుకుని కనిపించింది. టీచర్ తమ కూతురిని వేధించేవాడని బాధిత కుటుంబం ఆరోపించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.