Site icon HashtagU Telugu

Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ వల్ల పాక్ కు ఎంత నష్టం..? భారత్ కు ఎంత లాభం..?

Operation Sindoor

Operation Sindoor

భారత సైన్యం (Indian Army) చేపట్టిన “ఆపరేషన్ సిందూర్” (Operation Sindoor) పాక్ (Pak) పై సంచలనాత్మక దాడిగా చరిత్రలో నిలిచింది. ఈ ఆపరేషన్‌లో భారత్ ఒక్కసారిగా తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం (Nine Terrorist Camps Destroyed) చేసింది. లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ లాంటి పాక్ ప్రేరిత ఉగ్ర సంస్థల స్థావరాలను టార్గెట్ చేయడం ద్వారా, పాక్‌కు గట్టిదెబ్బ ఇచ్చింది. ఉగ్రవాదుల పునాదులే కూల్చేయడం ద్వారా పాక్‌ ఉగ్రవాద మిషన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా జైషే చీఫ్ మసూద్ అజర్ కుటుంబ సభ్యుల మృతి, పలువురు కీలక ఉగ్రవాదుల హత్యలు ఈ దాడికి తీవ్రతను తెలియజేశాయి.

virat kohli: ‘మీరు సంతోషంగా ఉన్నారా?’ ప్రేమానంద్ మహారాజ్ ప్రశ్నకు కోహ్లీ స‌మాధానం ఇదే..

ఈ దాడితో పాక్ సైనిక శక్తికి భారీగా నష్టం జరిగింది. పంజాబ్ ప్రావిన్స్‌లోని పలు ఆర్మీ బేస్‌లు ధ్వంసమయ్యాయి. పాకిస్థాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సైతం పూర్తిగా పతనమైంది. భారత వైమానిక దళం SCALP క్షిపణులు, HAMMER బాంబులతో చేసిన దాడులు పాక్‌ను బెంబేలెత్తించాయి. ఇక కరాచీ పోర్టుపై దాడి చేయడం ద్వారా భారత్ 1971 తర్వాత మళ్లీ నావికా దళ శక్తిని ప్రదర్శించింది. లాహోర్, పెషావర్, స్కార్దు, సర్గోధ వంటి కీలక స్థావరాలు కూడా ధ్వంసమవడం పాక్ సైనిక సామర్థ్యానికి గట్టి ఎదురుదెబ్బగా మారింది.

24 Fingers Family: ఆ ఫ్యామిలీలో 50 మందికి 24 వేళ్లు.. ఎందుకు ? ఎలా ?

ఆర్థికపరంగా చూస్తే.. పాక్ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పతనమయ్యాయి. రూ. 80,000 కోట్లకు పైగా నష్టం జరిగింది. IMF అందించిన 2 బిలియన్ డాలర్ల ప్యాకేజీ కూడా ఈ దెబ్బను భర్తీ చేయలేని పరిస్థితి. పైగా, పాక్‌కు ఆయువు పట్టుగా భావించే అణ్వాయుధ నిల్వలపై కూడా భారత దృష్టి సారించడం గమనార్హం. ఈ ఆపరేషన్ ద్వారా భారత్ ప్రపంచానికి తన సైనిక సామర్థ్యాన్ని చాటగా, పాక్‌కు మాత్రం దీన్ని తట్టుకోలేని నష్టంగా మిగిలింది. అంతర్జాతీయంగా భారత్ కు మద్దతు పెరగడం, ఉగ్రవాదంపై తీసుకున్న నిశ్చయంతో భారత్ గ్లోబల్ పవర్ గా అవతరించింది.