Operation Sindoor Inside : ఇప్పుడు యావత్ భారతదేశంలో ‘ఆపరేషన్ సిందూర్’ గురించే చర్చ జరుగుతోంది. అందరికీ ఆపరేషన్ సిందూర్ ఎలా జరిగిందో తెలిసిపోయింది. అయితే దాన్ని నిర్వహించడానికి ముందు జరిగిన పెద్ద కసరత్తు గురించి చాలామందికి తెలియదు. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాల ఎంపిక దగ్గరి నుంచి దాడి ఏ టైంలో చేయాలనే అంశం దాకా ప్రతీదీ ఎంతో మేధోమధనం తర్వాతే డిసైడయ్యాయి. ఈ అంశాలపై వివరాలతో ఇన్‌సైడ్ స్టోరీ ఇదిగో..
Also Read :Operation Sindoor : ‘ఆపరేషన్ సిందూర్’ ట్రేడ్‌మార్క్, టైటిల్ కోసం పోటీ.. రేసులో ‘రిలయన్స్’
మే 3న ఏం చేశారంటే..
ఏప్రిల్ 22న జమ్మూకశ్మీరులోని పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడి జరిగిన 11వ రోజున అంటే మే 3న ఢిల్లీలోని పార్లమెంటు సౌత్ బ్లాక్‌లో ఒక కీలక సమావేశం జరిగింది. ఇందులో ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారుడు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, వాయుసేన చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ మీటింగ్‌లోనే ఆపరేషన్ సిందూర్ కోసం భారత త్రివిధ దళాల నుంచి పలువురు అధికారులను ఎంపిక చేశారు.
మే 4న ఏం చేశారంటే..
ఆపరేషన్ సిందూర్ కోసం భారత ప్రభుత్వం(Operation Sindoor Inside) ఎంపిక చేసిన త్రివిధ దళాల అధికారుల టీమ్ మే 4న సమావేశమైంది. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా దాడి చేయాల్సిన పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీరులోని ప్రాంతాలను గుర్తించింది. ఉగ్రవాద స్థావరాలపై దాడి ఎలా చేయాలి ? ఏయే ఆయుధాలు వాడాలి ? ఎంతసేపట్లో దాడి పూర్తి కావాలి ? దాడి చేసే క్రమంలో చేపట్టాల్సిన రక్షణ చర్యలు, ముందుజాగ్రత్త చర్యలు ఏమిటి ? పాకిస్తాన్ ప్రతిఘటిస్తే ఏం చేయాలి ? దాడి చేసే క్రమంలో త్రివిధ దళాలు ఎలా సమన్వయం చేసుకోవాలి ? ఆర్మీ ఎలాంటి ఆయుధాలతో దాడి చేయాలి ? వాయుసేన ఎలాంటి ఆయుధాలతో దాడి చేయాలి ? అనే అంశాలపై క్లారిటీతో పక్కా ప్లాన్‌ను ఈ టీమ్ తయారు చేసింది.
మే 5న ఏం చేశారంటే..
త్రివిధ దళాల నుంచి ఎంపిక చేసిన అధికారులతో పార్లమెంటు సౌత్ బ్లాక్‌లో మే 5న మరో కీలక సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లోనే ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన ప్లానింగ్ గురించి ప్రధాని మోడీకి త్రివిధ దళాల అధికారులు వివరించారు. దీని మోడీ ఆమోదం తెలిపారు. జైషే మహ్మద్, లష్కరే తైబా ఉగ్రవాద సంస్థల స్థావరాలను టార్గెట్ చేయాలని డిసైడ్ చేశారు.
మే 6న అర్ధరాత్రి తర్వాత..
ఆపరేషన్ సిందూర్ కోసం భారత వాయుసేన, ఆర్మీలకు చెందిన ప్రత్యేక టీమ్‌లు మే 6వ తేదీన అర్ధరాత్రి అకస్మాత్తుగా యాక్టివేట్ అయ్యాయి. ఆ రోజు అర్ధరాత్రి తర్వాత (మే 7న తెల్లవారుజామున 1:05 గంటలకు) పాకిస్తాన్, పీఓకేపై భారత్ వైమానిక దాడులు చేసింది. 25 నిమిషాల్లోనే 7 పాక్, పీఓకే నగరాల్లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది.