Rice Consumption : మనదేశంలోని ఒక్కో రాష్ట్రం ప్రజలకు ఒక్కో రకమైన ఆహారపు అలవాట్లు ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో గోధుమలు ప్రధాన ఆహారంగా ఉంటే, ఇంకొన్ని రాష్ట్రాల్లో బియ్యం ప్రధాన ఆహారం. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల ప్రజల నెలవారీ తలసరి బియ్యం వినియోగం ఒక కేజీ కూడా ఉండదట. . ఈవిషయాన్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ‘కుటుంబ వినియోగ వ్యయం సర్వే: 2023-24’ నివేదికలో ప్రస్తావించారు. అక్కడి ప్రజలు ప్రధాన ఆహార వనరుగా గోధుమలను వినియోగిస్తున్నారు. రోజూ మూడు పూటలా చపాతీలే తినడానికి వాళ్లు ప్రయారిటీ ఇస్తారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌లలో గోధుమ సాగు ఎక్కువ. దీనివల్ల అక్కడ అది తక్కువ రేటుకే లభిస్తుంది.
Also Read :100 Years For Electric Train : మన తొలి విద్యుత్ రైలుకు నేటితో వందేళ్లు.. ఆ ట్రైన్ విశేషాలివీ
తెలుగు రాష్ట్రాల్లో..
- బియ్యం వినియోగంలో తెలంగాణ రాష్ట్రం మన దేశంలో 9వ స్థానంలో ఉంది. తెలంగాణలోని ప్రజల నెలవారీ తలసరి బియ్యం వినియోగం 8.4215 కేజీలు.
- ఏపీ ప్రజల నెలవారీ తలసరి బియ్యం వినియోగం 7.9185 కేజీలు. ఈవిషయంలో ఏపీ మన దేశంలో 12వ స్థానంలో ఉంది.
- దక్షిణాదిలో బియ్యం వినియోగం ఎక్కువగా జరుగుతున్న తెలుగు రాష్ట్రాల్లోనే.
- ఏపీలో కిలో బియ్యానికి ప్రజలు సగటున రూ.29 ఖర్చు చేస్తున్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రజలు రూ.31 దాకా ఖర్చు చేస్తున్నట్లు సర్వేలో గుర్తించారు.
- ప్రజల తలసరి బియ్యం వినియోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు 14వ స్థానంలో, కేరళ 18వ స్థానంలో, కర్ణాటక 20వ స్థానంలో ఉంది.
- దక్షిణాదిలోని కేరళ, కర్ణాటకలలో గోధుమలు, జొన్నలు, రాగులు, ఇతర చిరుధాన్యాల వినియోగం క్రమంగా పెరుగుతోంది.
- బియ్యం వినియోగంలో నంబర్ 1 స్థానంలో మణిపూర్, నంబర్ 2 స్థానంలో త్రిపుర, నంబర్ 3 స్థానంలో అరుణాచల్‌ప్రదేశ్ ఉన్నాయి.
- మొత్తం మీద మన దేశంలోని 20 రాష్ట్రాల్లో ఇప్పటికీ బియ్యమే ప్రధాన ఆహార వనరు.
Also Read :ISROs 100th Mission : ఇస్రో 100వ ప్రయోగం ఫెయిల్.. కక్ష్యలోకి చేరని ‘ఎన్‌వీఎస్-02’ శాటిలైట్
సాధారణ తరహా బియ్యం రేటు ప్రస్తుతం సగటున రూ.45కుపైనే ఉంది. సాధారణ తరహా గోధుమల(Rice Consumption) రేటు ప్రస్తుతం రూ.30కిపైనే ఉంది. మొత్తం మీద బియ్యమే ఎక్కువ ధరతో వస్తుంది. గోధుమలను కొన్న తర్వాత వాటిని పిండిగా మార్చుకోవడానికి ఇంకొంత డబ్బును ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే ధరతో సంబంధం లేకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు వారివారి సాంప్రదాయక ఆహారపు అలవాట్ల ప్రకారం బియ్యం తిన్నాలా ? గోధుమలు తినాలా ? అనేది డిసైడ్ చేసుకుంటారు.