Site icon HashtagU Telugu

Filming Girls Showeringస్నానం చేస్తుండగా ఫోన్ తో వీడియో తీశాడు.. స్టేషన్ ముందు ఆందోళన

Kanpur Imresizer

Kanpur Imresizer

హాస్టల్‌ విద్యార్థినులు స్నానం చేస్తుండగా తోటి విద్యార్థిని తీసిన వీడియోలు లీక్‌ కావడంతో ఇటీవల చండీగఢ్‌ యూనివర్సిటీ  భగ్గుమంది. ఈ ఘటన జరిగి రెండు వారాలు గడవకముందే అదే తరహాలో మరో ఘటన యూపీలోని కాన్పూర్‌లో వెలుగుచూసింది. అక్కడి ఓ హాస్టల్‌లో విద్యార్థినులు స్నానం చేస్తుండగా ఓ వ్యక్తి రహస్యంగా వీడియోలు తీయడం కలకలం రేపింది. తాము స్నానం చేస్తుండగా ఓ వ్యక్తి తన ఫోన్‌లో వీడియో తీశాడంటూ కొందరు విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే, పోలీసులు చర్యలు తీసుకోలేదంటూ గురువారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి నిరసన తెలిపారు. కాన్పూర్‌లోని ఒక గర్ల్స్‌ హాస్టల్‌లో స్నానం చేస్తుండగా అక్కడి ఉద్యోగి బాత్‌రూమ్‌ కిటికీలోంచి ఫోన్‌తో అభ్యంతరకర వీడియోలు తీశాడని ఫిర్యాదులో తెలిపారు. దీనిపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి ఆ ఉద్యోగిని అరెస్టు చేశారు. అతడి మొబైల్‌ ఫోన్‌ని ఫోరెన్సిక్‌ విశ్లేషణ కోసం ల్యాబ్‌కు పంపారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే..
ఈ హాస్టల్ ఓనర్ స్వయానా ఒక పోలీసు ఆఫీసర్. అయితే ఆయన ఉత్తరప్రదేశ్ లోనే ఒక జిల్లాలో అడిషనల్ ఎస్పీ హోదాలో పని చేస్తున్నారు. మెడికల్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ఎంతోమంది విద్యార్థినులు ఈ హాస్టల్ లో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నారు.