Site icon HashtagU Telugu

Decomposed Body: ఢిల్లీలో దారుణం.. కుళ్లిన విదేశీయుడి మృతదేహం లభ్యం

Indian Student Dies In US

Crime Imresizer

తూర్పు ఢిల్లీలోని గీతా కాలనీ ఫ్లైఓవర్ కింద శుక్రవారం సాయంత్రం మారిషస్‌కు చెందిన విదేశీయుడి మృతదేహం కుళ్లిపోయినట్లు (Decomposed Body) కనిపించడంతో కలకలం రేగింది. మృతుడు 65 ఏళ్ల భగవత్ లుత్మీగా గుర్తించినట్లు షాహదారా డీసీపీ రోహిత్ మీనా తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు గీతాకాలనీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక విచారణలో మృతుడి శరీరంపై ఎలాంటి గాయాలు కనిపించలేదు. మారిషస్ ఎంబసీని సంప్రదించడం ద్వారా మృతుడి గురించి మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు ఢిల్లీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Also Read: IndiGo Flight: ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ప్రయాణికుడు మృతి

శుక్రవారం గీతాకాలనీ ప్రాంతంలోని అండర్‌పాస్‌ సమీపంలో 1956లో జన్మించిన విదేశీయుడి మృతదేహం కుళ్లిపోయినట్లు గుర్తించామని డీసీపీ రోహిత్ మీనా తెలిపారు. ఘటనా స్థలం నుంచి పాస్‌పోర్టులు, ఇతర పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కొనసాగుతోంది. ఆ విదేశీ మృతదేహం ఫ్లైఓవర్ కిందకు ఎలా వచ్చిందో తెలియాల్సి ఉంది. ఇది హత్య లేదా సహజ మరణమా అని తెలుసుకోవడానికి ఢిల్లీ పోలీసులు సంఘటనా స్థలం చుట్టూ ఉన్న సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నారు. మరింతా సమాచారం తెలియాల్సి ఉంది.