Site icon HashtagU Telugu

Hemant Soren : జార్ఖండ్ సీఎంగా కల్పనా సోరెన్‌.. నేడు హేమంత్ సోరెన్ అరెస్ట్ ?

Hemant Soren

Hemant Soren

Hemant Soren :జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌‌ను కేంద్ర  ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేస్తే.. ఆయన భార్య కల్పనా సోరెన్‌ సీఎం  అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈవిషయాన్ని స్వయంగా హేమంత్ సోరెన్‌కు చెందిన జార్ఖండ్‌ ముక్తి మోర్చా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  మనీలాండరింగ్ కేసులో సీఎం సోరెన్‌ను ఈడీ ఇవాళ  ప్రశ్నించే అవకాశం ఉంది. వాంగ్మూలాన్ని నమోదు చేసిన తర్వాత  ఈడీ ఆయనను అరెస్టు చేసే ఛాన్స్ ఉంది.  మంగళవారం  సాయంత్రం జరిగిన అధికార కూటమి ఎమ్మెల్యేల సమావేశంలోనే తన భార్య కల్పనా సోరెన్ పేరును తదుపరి సీఎంగా హేమంత్ సోరెన్ ప్రపోజ్ చేశారని సమాచారం. అయితే ఈ సమయంలో ప్రభుత్వాన్ని కాపాడుకోవడం చాలా కీలకం కాబట్టి ఎమ్మెల్యేలు కూడా అంగీకరించారని తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join

కాంగ్రెస్‌కు చెందిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి బన్నా గుప్తా  మాట్లాడుతూ.. ‘‘మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు(Hemant Soren) పూర్తిగా మద్దతు ఇస్తారు’’ అని స్పష్టంచేశారు. అయితే కల్పనా సోరెన్ సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు కొన్ని చట్టపరమైన అడ్డంకులు ఎదురుకావచ్చని అంచనా వేస్తున్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం అసెంబ్లీ పదవీకాలం ఏడాది కంటే తక్కువ వ్యవధి ఉన్నప్పుడు ఉప ఎన్నికలను నిర్వహించలేరు. ఎవరైనా జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ ఎమ్మెల్యేతో రాజీనామా చేయించినా.. ఉప ఎన్నిక నిర్వహించేందుకు అవకాశాలు లేవు. అందుకే ఇప్పటికిప్పుడు కల్పనా సోరెన్ ఎమ్మెల్యే కావడం కష్టమే. ఈ ఏడాది నవంబర్‌లోనే జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ విషయంలో లీగల్‌ ఒపీనియన్‌ తీసుకుంటామని జార్ఖండ్ ముక్తి మోర్తా వర్గాలు చెబుతున్నాయి. లేదంటే కల్పా సోరెన్ స్థానంలో మరొక సీనియర్ నేత సీఎం అవుతారని అంటున్నాయి.

Also Read : AP : వైస్ షర్మిలకు ప్రాణహాని.. భద్రత పెంచాలి – అయ్యన్నపాత్రుడు

రూ.600 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి యాజమాన్యాన్ని అక్రమంగా మార్చేసి.. తదుపరిగా దాన్ని రియల్ ఎస్టేట్ బిల్డర్లకు సీఎం హేమంత్ సోరెన్ కట్టబెట్టారని ఈడీ ఆరోపిస్తోంది.  ఈ కేసులో ఇప్పటి వరకు 14 మందిని ఈడీ అరెస్ట్ చేసింది. అరెస్టయిన వారిలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా, రాంచీ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన 2011 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఛవీ రంజన్ కూడా ఉన్నారు.

Also Read :Puri Jagannadh Divorce : ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారిన డైరెక్టర్ పూరి విడాకుల వార్త..