Black Magic Vs 1500 Crores: ముంబైలోని లీలావతి ఆస్పత్రి చాలా ఫేమస్. దేశ వాణిజ్య రాజధానిలోని ఎంతోమంది సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు, రాజకీయ దిగ్గజాలు ఈ ఆస్పత్రిలోనే చికిత్స కోసం వెళ్తుంటారు. ఇటీవలే ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ చికిత్స పొందింది కూడా లీలావతి ఆస్పత్రిలోనే. ఓ సంచలన అంశం కారణంగా ఇప్పుడీ ఆస్పత్రి తాజాగా వార్తల్లోకి ఎక్కింది. తమ ఆస్పత్రిలో ఎవరో క్షుద్రపూజలు చేశారని స్వయంగా లీలావతి హాస్పిటల్ ట్రస్టీలు ఇటీవలే ఆరోపించారు. తమకు ఆస్పత్రిలో పుర్రెలు, మానవ వెంట్రుకలు పెట్టిన 7 కలశాలు దొరికాయన్నారు. మాజీ ట్రస్టీలు ఆస్పత్రిలో రూ.1500 కోట్ల స్కాం చేశారని పేర్కొన్నారు.
Also Read :YouTuber Harsha Sai: హర్ష సాయిపై కేసు.. ఇతడు ఎవరు ? ఎందుకీ కేసు ?
లీలావతి ఆస్పత్రి.. రూ.1500 కోట్ల స్కాం
- ప్రముఖ వజ్రాల వ్యాపారవేత్త కీర్తిలాల్ మెహతా (Black Magic Vs 1500 Crores) తన భార్య లీలావతి మెహతా పేరిట లీలావతి ఆస్పత్రిని ఏర్పాటు చేశారు.
- ఈ ఆస్పత్రిని నడిపేందుకు ‘లీలావతి కీర్తిలాల్ మెహతా మెడికల్ ట్రస్ట్’ను ఏర్పాటు చేశారు.
- లీలావతి ఆస్పత్రి నిర్మాణానికి 1997లో పునాది వేశారు.
- 2002లో కీర్తిలాల్ మెహతాకు ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. దీంతో ట్రస్ట్ బాధ్యతలను ఆయన సోదరుడు విజయ్ మెహతా చేపట్టారు.
- 2006లో విజయ్ మెహతా తన కొడుకు, మేనల్లుళ్లను ట్రస్టీలుగా చేశారని.. కిషోర్ మెహతాను శాశ్వత ట్రస్టీ పదవి నుంచి తొలగించారనే ఆరోపణలు వచ్చాయి.
- 2016లో కిషోర్ మెహతా తిరిగి ఈ ట్రస్టులో ట్రస్టీ అయ్యారు.
- 2024లో కిషోర్ మెహతా కన్నుమూశారు. అనంతరం ఆయన కుమారుడు ప్రశాంత్ మెహతా శాశ్వత ట్రస్టీగా నియమితులు అయ్యారు.
- ఈక్రమంలో లీలావతి ఆస్పత్రి ఆర్థిక రికార్డులను ఆడిట్ చేయించారు. ఈ ఆడిటింగ్‌లోనే అక్రమాలు వెలుగు చూశాయి. ఇప్పుడు దీనిపై దర్యాప్తు జరుగుతోంది.
- లీలావతి కీర్తిలాల్ మెహతా మెడికల్ ట్రస్ట్ సభ్యులు ప్రశాంత్ మెహతా, ఆయన తల్లి చారు మెహతాలు ఇప్పటికే ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్‌తో పాటు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఫిర్యాదు చేశారు. మాజీ ట్రస్టీలు ఆస్పత్రిలో రూ.1,500 కోట్ల స్కామ్ చేశారని ఆరోపించారు. ఆ నిధులన్నీ వారు దుర్వినియోగం చేశారని చెప్పారు.
- ముంబైలోని బాంద్రా మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాల మేరకు తాము ఫిర్యాదులు ఇచ్చామని, అవి ఎఫ్ఐఆర్‌లుగా మారాయని లీలావతి ఆస్పత్రి శాశ్వత ట్రస్టీ ప్రశాంత్ మెహతా తెలిపారు. మాజీ ట్రస్టీలు, సంబంధిత వ్యక్తులపై మూడు కంటే ఎక్కువ ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయన్నారు.
- గుజరాత్‌లోని లీలావతి ఆస్పత్రి నుంచి విలువైన వస్తువుల దొంగతనం కేసులో మరో కేసు దర్యాప్తులో ఉందని ప్రశాంత్ చెప్పారు.
- లీలావతి ఆస్పత్రి మాజీ ట్రస్టీలు ముగ్గురిపై నమోదైన రూ.85 కోట్ల మోసం కేసుపై దర్యాప్తు ప్రారంభమైంది.